Tuesday, March 21, 2023

fingerprint authentication, UIDAI కొత్త టెక్నాలజీ.. Aadhaar అక్రమాలను ఇట్టే పట్టేయొచ్చు.. వేలిముద్రల గుర్తింపులో కృత్రిమ మేధ! – uidai aadhaar based fingerprint authentication a new security mechanisms rolled out


Aadhaar: ప్రస్తుత రోజుల్లో ఆధార్ అనేది ఎంతో ముఖ్యమే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క ఆధార్‌తోనే ఎన్నో పనులు పూర్తి చేసే వెసులుబాట్లు అందుబాటులోకి వచ్చాయి. ఆధార్‌తో బ్యాంక్ పేమెంట్లు సైతం చేయొచ్చు. అయితే, ఇదే స్థాయిలో ఆర్థిక నేరాలు సైతం జరుగుతున్నాయి. ఆధార్ ద్వారా కేటుగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. వీటిని అరికట్టెందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI). ఆధార్ ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న ముఠాల ఆటలు కట్టించేందుకు అత్యాధునిక భద్రత వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధార్ సిస్టమ్‌లోనే అత్యంత కీలకమైన వేలి ముద్రల గుర్తింపు మరింత బలోపేతం చేసే కొత్త టెక్నాలజీని వినియోగంలోకి తీసుకొచ్చింది.

కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ (AI/ML) టెక్నాలజీ ఆధారంగా రెండు అంచెల విధానంలో వేలి ముద్రలను సరి పోల్చి నిర్ధారిస్తారు. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కొత్త భద్రతా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం పలు ఆర్థిక లావాదేవీలకు ఆధార్ తప్పనిసరిగా మారింది. ఈ పరిస్థితుల్లో వేలి ముద్రల గుర్తింపు (Fingerprint Authentication) మరింత బలోపేతం చేయడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది యూఐడీఏఐ. బయోమెట్రిక్ మిషన్ల ద్వారా తీసుకున్న వేలి ముద్రలు సక్రమమైనవేనా? లేదా అనే విషయాన్ని కృత్రిమ మేధ ద్వారా పక్కాగా గుర్తించనున్నారు. వేలి ముద్రలను రెండు అంచెల్లో తనిఖీ చేస్తారు. వేలి ముద్రల్లోని గీతల స్పష్టత ఏకీకృతం అయ్యే ప్రాంతాల ఆధారంగా అవి నకిలీవో, అసలైనవో తేల్చుతుంది ఈ టెక్నాలజీ. పలు ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద ప్రయోగాత్మకంగా అమలు చేసింది యూఐడీఏఐ. దీని ద్వారా మంచి ఫలితాలు రావడం వల్ల దేశ వ్యాప్తంగా ఈ కొత్త టెక్నాలజీని అమలు చేయాలని నిర్ణయించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ పొందేందుకు ఆధార్ ధ్రువీకరణ కీలకం. ఈ నేపథ్యంలో కొత్త టెక్నాలజీతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధార్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆధార్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 8,829 కోట్లకుపైగా లావాదేవీల్లో వేలి ముద్రల గుర్తింపు సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు చెప్పారు. రోజుకు సగటున ఏడు కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగినట్లు యూఐడీఏఐ ప్రకటించింది. మరోవైపు.. ఇప్పటి వరకు కొత్త సెక్యూర్డ్ అథెంటికేషన్‌కు అప్‌గ్రేడ్ కాని ఆధార్ ఆధారిత సంస్థలకు యూఐడీఏఐ హెడ్ ఆఫీస్, ప్రాంతీయ కార్యాలయాలు సమాచారం అందించాయి. కొత్త టెక్నాలజీకి అప్‌గ్రేడ్ కావాలని స్పష్టం చేశాయి.

గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్‌ నుంచి మరో Vande Bharat రైలు.. రూట్ ఇదే!BSNL స్పెషల్ డేటా ఆఫర్.. రూ.398తోనే అన్‌లిమిటెడ్ డేటా, కాలింగ్.. స్పీడ్ తగ్గే ప్రసక్తే లేదు!ChatGPT మనుషులతో పోటీ పడలేదు: Infosys నారాయణ మూర్తి!



Source link

Latest news
Related news