Friday, March 31, 2023

Chiranjeevi: మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై పోరాటం ఇంకా శ‌క్తి వంత‌మ‌వుతుంది: చిరంజీవి

Chiranjeevi – Khusbu Sundar: సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్‌ (Khushbu Sundar) జాతీయ మ‌హిళా క‌మీష‌న్ స‌భ్యురాలిగా నామినేట్ అయ్యారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆమెకు కీల‌క ప‌ద‌విని ఇచ్చారు. ఈ ప‌ద‌విలో ఆమె మూడేళ్ల పాటు సేవ‌ల‌ను అందించ‌బోతున్నారు. ఖుష్బూకి ఇంత మంచి ప‌దవి రావ‌టంపై ఆమె స‌న్నిహితులతో పాటు సినీ ప్ర‌ముఖులు సైతం ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమెకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఖ‌ష్బూ సుంద‌ర్‌కి ట్విట్ట‌ర్ ద్వారా అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

‘‘ఖుష్బూ సుందర్‌కి అభినంద‌న‌లు. క‌చ్చితంగా ఆ ప‌ద‌వికి ఆమె అర్హురాలు. జాతీయ మ‌హిళా క‌మీష‌న్ స‌భ్యురాలిగా ఎంపికైన ఆమె వ‌ల్ల మ‌హిళ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై ఎక్కువ దృష్టి పెరుగుతుంది. వాటి ప‌రిష్కారాల‌ను కూడా స‌మ‌ర్ద‌వంతంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్న వారి గొంతుక మ‌రింత శ‌క్తివంతంగా మారుతుంది’’ అని అంటూ త‌న మెసేజ్‌లో పేర్కొన్నారు చిరంజీవి. సినీ రంగంలో ఖుష్బూకి చిరంజీవి మంచి ఫ్రెండ్‌. వారిద్ద‌రూ క‌లిసి స్టాలిన్ సినిమాలో న‌టించారు. రీసెంట్‌గా ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లోనూ న‌టించిన సంగ‌తి తెలిసిందే.

జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా నామినేట్‌ చేయడంపై ఖుష్బూ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ‘నాకు ఇంత గొప్ప బాధ్యతను అప్పగించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికీ కృతజ్ఞతలు’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. మోదీ నాయకత్వంలో నారీశక్తిని పరిరక్షించేందుకు తన వంతుగా కష్టపడి పనిచేస్తానని ఈ సంద‌ర్బంగా ఆమె తెలియ‌జేశారు.

ALSO READ: Naatu Naatu: ‘నాటు నాటు’కి వెంకీ మామ అదిరిపోయే డాన్స్‌.. అవార్డులన్నీ రామ్‌ చ‌ర‌ణ్‌కేన‌ట‌
ALSO READ:
ALSO READ: RC 15 Vs ఇండియ‌న్ 2… చ‌ర‌ణ్ సినిమాకు స‌మ‌స్య‌!

Latest news
Related news