Sunday, April 2, 2023

Babar Azam | పాక్ జర్నలిస్ట్‌కి బాబర్ అజామ్ కౌంటర్.. అచ్చం రోహిత్ శర్మలానే చురకలు

పాకిస్థాన్ ( Pakistan) జర్నలిస్ట్ అడిగిన ఓ ప్రశ్నకి కెప్టెన్ బాబర్ అజామ్ (Babar Azam) అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. కానీ.. అది కాపీ అని తెలిసిన తర్వాత బాబర్‌ని ఓ రేంజ్‌లో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? పాక్ గడ్డపై జరుగుతున్న పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో పెషావర్ జాల్మీ జట్టుకి ఈ ఏడాది బాబర్ అజామ్ కెప్టెన్‌గా ఆడుతున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌లో అదరగొట్టేస్తున్న బాబర్.. జట్టుని కూడా పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితిలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ.. అతను గత ఏడాది వరకూ ప్రాతినిథ్యం వహించిన కరాచీ కింగ్స్ టీమ్ మాత్రం వరుస పరాజయాలతో ఢీలా పడిపోయింది. ఐదు మ్యాచ్‌లాడిన ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో బాబర్ అజామ్‌ని కరాచీ కింగ్స్ టీమ్ ప్రదర్శన గురించి ఓ జర్నలిస్ట్ అడిగాడు.

కరాచీ కింగ్స్ టీమ్ ప్రదర్శన గురించి జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నని సీరియస్‌గా విన్న బాబర్ అజామ్ ‘‘నేను ఆ టీమ్ కోచ్‌నా? ఎందుకు ఆ జట్టు గురించి నన్ను అడుగుతున్నావ్? ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడండి’’ అని చురకలు అంటించాడు. వాస్తవానికి రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా 2019లో ఇలానే జర్నలిస్ట్‌కి కౌంటర్ ఇచ్చాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన గురించి రోహిత్ శర్మని ప్రశ్నించిన జర్నలిస్ట్.. ఆ జట్టు బ్యాటర్లకి ఏమైనా సలహా ఇస్తారా? అని అడిగాడు. దానికి రోహిత్ శర్మ ‘‘నేను ఒకవేళ పాకిస్థాన్ కోచ్ అయితే.. కచ్చితంగా చెప్తాను’’ అంటూ కౌంటర్ వేశాడు. దెబ్బకి జర్నలిస్ట్ సైలెంట్ అయిపోయాడు.
కరాచీ కింగ్స్ టీమ్‌పై బాబర్ అజామ్ గత కొన్నిరోజులుగా గుర్రుగా ఉన్నాడు. గత ఏడాది బాబర్ కెప్టెన్సీలో ఆ జట్టు 10 మ్యాచ్‌లాడి కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. అలానే పాయింట్ల పట్టికలోనూ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. దాంతో పీఎస్‌ఎల్ 2023 సీజన్ ముంగిట బాబర్‌ని ఆ ఫ్రాంఛైజీ వదిలేసింది. పాకిస్థాన్ టీమ్ కెప్టెన్‌గా కూడా ఉన్న బాబర్‌కి ఇది ఊహించని చేదు అనుభవం.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news