Friday, March 24, 2023

AP SI Result 2023 : ఏపీ ఎస్‌ఐ రాత పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ లింక్‌ ఇదే క్లిక్‌ చేయండి

AP SI Result 2023 : ఏపీలో ఎస్సై ఉద్యోగాలకు నిర్వహించిన ప్రిలిమ్స్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (APSLPRB) విడుదల చేసింది. 411 పోస్టులకు గాను ఫిబ్రవరి 19న రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 1,51, 288 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 57,923 మంది అర్హత సాధించారు.

పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి 1,553 అభ్యంతరాలను స్వీకరించినట్లు APSLPRB తెలిపింది. అర్హత సాధించిన అభ్యర్థులు మార్చి 4 ఉదయం 11 గంటల వరకు ఓఎంఆర్‌ షీట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. రెండు పేపర్లలో అర్హత సాధించిన వారికే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు APSLPRB తెలిపింది.

రాత పరీక్ష ఫలితాల కోసం క్లిక్‌ చేయండి.. లింక్‌ ఇదే

Latest news
Related news