‘మంగళవారం’ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసినా.. ఈ మూవీ కథ గురించిన వివరాలేవీ వెల్లడించలేదు అజయ్. అయితే ఈ పోస్టర్‌లో ఒక మహిళను రంగురంగుల సీతాకోకచిలుక రూపంలో రిప్రజెంట్ చేశారు. అంటే ఇది స్వేచ్ఛకు సంబంధించిన చిత్రం అయ్యుంటుందనే వాదనలు నెట్టింట వినిపిస్తు్నాయి. ముద్ర మీడియా వర్క్స్‌కు చెందిన స్వాతి గునుపాటి, సురేష్ వర్మతో కలిసి ఈ చిత్రానికి తను కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు అజయ్. కాగా ఈ పాన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్.. టైటిల్ పోస్టర్‌తోనే నెటిజన్లతో పాటు ఇండస్ట్రీ వర్గాలను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇక ‘మంగళవారం’ చిత్రానికి బి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ (B Ajaneesh Loknath) అందించనున్నారు. ఆయన ‘కాంతార’ చిత్రానికి ఇచ్చిన మ్యూజిక్‌కు ఏ రేంజ్‌లో పేరొచ్చిందో తెలిసిందే. ఇక ఆర్ట్ డైరెక్టర్‌గా రఘు కులకర్ణి, సౌండ్ డిజైనర్‌గా రాజా కృష్ణన్, సినిమాటోగ్రాఫర్‌గా దాశరధి శివేంద్ర పనిచేయనున్నారు. అయితే నటీనటుల వివరాలను ఇంకా వెల్లడించనప్పటికీ.. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఇదిలా ఉంటే, రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి.. తన మొదటి సినిమా RX100ను బోల్డ్‌గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. అప్పటి వరకు స్టీరియోటైపిక్ లవ్ స్టోరీస్‌కు అలవాటు పడిన టాలీవుడ్‌కు కొత్త రకం స్టోరీతో
హిట్ కొట్టి చూపించాడు అజయ్. దీంతో ఇప్పుడు మిగతా ఫిలిం మేకర్స్ సైతం ప్రేమ కథల్లోనే కొత్త యాంగిల్ ట్రై చేసేందుకు ధైర్యం చేస్తున్నారు. ఇదే తరహాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన ‘డీజే టిల్లు’ డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఇదే ఉత్సాహంతో ఆ చిత్ర నిర్మాతలు ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ పేరుతో సీక్వెల్ మూవీ తెరకెక్కిస్తుండటం విశేషం.
- Read Latest Tollywood Updates and Telugu News