ఈ ఫైర్ ఇన్సిడెంట్‌ను కొందరు వీడియో తీశారు. మెయిన్ ఎంట్రన్స్ వద్ద కూర్చొని ఎవరో సిగరెట్ కాల్చారని, ఆ తర్వాత కొద్ది నిమిషాలకే సెట్‌లో మంటలు చెలరేగాయని దీన్ని రికార్డ్ చేసిన వ్యక్తులు మాట్లాడుకుంటుండటం వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో వినబడుతోంది. మొత్తానికి మంటలు భారీగానే చెలరేగి సెట్ మొత్తం కాలిపోతున్నట్లు వీడియో ద్వారా స్పష్టమవుతోంది. అంతేకాదు దగ్గరలో నీళ్లు కూడా అందుబాటులో లేవని, మంటలు పూర్తిగా వ్యాపించకముందే ఫైర్ ఇంజన్‌కు ఫోన్ చేయండని చర్చించుకోవడం కూడా ఇందులో వినిపిస్తోంది.
మంటల్లో కాలిపోయిన ‘ఆచార్య’ మూవీ టెంపుల్ సెట్
హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో సుమారు 20 ఎకరాల్లో ఈ సెట్ వేశారు. సురేష్ సెల్వరాజన్ నిర్మించిన ఈ సెట్‌కు దాదాపు రూ. 23 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. నిజానికి ఈ సినిమాకు నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి సైతం డైరెక్టర్ కొరటాల శివ పట్ల తన అసంతృప్తిని పలు వేదికలపై ఇన్‌డైరెక్ట్‌గా వెల్లగక్కిన సంగతి తెలిసిందే.
- Read Latest Tollywood Updates and Telugu News