Friday, March 24, 2023

TS PGECET 2023 షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలివే

TS PGECET 2023 Notification : తెలంగాణలో మే 29 నుంచి జూన్‌ 1 వరకు పీజీఈసెట్‌ (TS PGECET 2023) పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ TS PGECET 2023 కు సంబంధించి దరఖాస్తుల షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ టెక్నాల‌జిక‌ల్ యూనివ‌ర్సిటీ (JNTU) విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 2023-24 విద్యా సంవ‌త్స‌రానికి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. టీఎస్ పీజీఈసెట్‌ నోటిఫికేష‌న్ ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌ల అవుతుంది. వివరాల్లోకెళ్తే..

TS PGECET 2023 షెడ్యూల్‌ ఇదే:

  • ఫిబ్రవరి 28: నోటిఫికేషన్‌ విడుదల
  • మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 30 వరకు: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంటుంది.
  • మే 2-4: దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తారు.
  • మే 5-24: రూ.250 నుంచి రూ.5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం ఉంటుంది.
  • మే 21 నుంచి: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభమవుతుంది
  • మే 29 నుంచి జూన్‌ 1 వరకు: 19 సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి.
  • పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్‌లో మాత్రమే పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
  • దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600; ఇతరులకు రూ.1100 గా నిర్ణయించారు.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://pgecet.tsche.ac.in/

Latest news
Related news