Sunday, April 2, 2023

star performer, స్టార్ పెర్ఫామర్‌గా ‘హైదరాబాదీ’.. అయినా ఉద్యోగం పీకేసి Google.. కారణమేంటి? – google india star performer of the month in hyderabad laid off


Google Layoffs: ప్రముఖ సర్చ్ ఇంజిన్, టెక్ దిగ్గజం గూగుల్ ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా 12 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో మాతృ సంస్థ ఆల్ఫాబెట్ లోని 6 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా మందికి మెయిల్స్ పంపించింది సంస్థ. అయితే, ఇప్పుడు గూగుల్ లేఆఫ్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. లేఆఫ్స్‌కు గురైన ఉద్యోగులు ఒక్కొక్కరుగా తమకు ఎదురైన అనుభవాలను సోషల్ మీడియాల్లో పంచుకుంటున్నారు. అసలు ఏ ప్రాతిపాదికన ఉద్యోగంలోంచి తొలగిస్తుందనే అంశాన్ని లేవనెత్తరా హైదరాబాద్‌కు చెందిన హర్ష్ విజయ్ వారిగ్య అనే ఉద్యోగి. తాను స్టార్ పెర్ఫామర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచినా ఉద్యోగం నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు.

హైదారాబాద్‌లోని గూగుల్ ఆపరేషన్స్ సెంటర్‌లో పనిచేస్తున్నారు హర్ష్ విజయ్ వారిగ్య. ఈ క్రమంలో ఇటీవలే ఆయనకు కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది. దానిని ఓపెన్ చేసి షాక్‌కు గురయ్యారు. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ మెయిల్ పంపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని గూగుల్ సెంటర్లలో పని చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీ. అందులో భాగంగానే హర్ష్ విజయ్‌కి పింక్ స్లిప్ అందినట్లు తెలుస్తోంది.

అయితే, హర్ష్ విజయ్ వారిగ్య ఇటీవలే స్టార్ పెర్ఫామర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచారు. అయినప్పటికీ ఉద్యోగం లోంచి తొలగించడమే ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ క్రమంలో తాను ఇప్పటికీ స్టార్ పెర్ఫామర్ ఆఫ్ ది మంత్‌గా ఉన్నపప్పుడు తననే ఎందుకు తొలగించారని లింక్డ్ ఇన్‌ పోస్ట్ ద్వారా ప్రశ్నించారు విజయ్. ఈ క్రమంలో గూగుల్ లేఆఫ్స్ తనపై ఎలా ప్రభావం చూపించిందో రాసుకొచ్చారు. వచ్చే రెండు నెలలు తనకు సగం జీతమే వస్తుందని, తన ఆర్థిక ప్రణాళికలన్నీ తారుమారైపోయాయని పేర్కొన్నారు హర్ష్ విజయ్. తనకు మెయిల్ గత శనివారం వచ్చిందని, అయితే, లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ పెట్టేందుకు తనకు రెండు రోజులు సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు తన మనుగడ కోసం పోరాడాల్సి వచ్చిందన్నారు.

అయితే, ఈ పరిస్థితి హర్ష్ విజయ్ వారిగ్యది మాత్రమే కాదు. చాలా మంది గూగుల్ ఉద్యోగుల పరిస్థితి ఇలాగే ఉంది. గురుగావ్‌లోని గూగుల్ క్లౌడజ్ ప్రోగ్రామ్ మేనేజర్ అయిన ఆకృతి వాలియాను ఇటీవలే తొలగించింది సంస్థ. అయితే, తాను కొద్ది రోజుల క్రితమే గూగుల్‌లో ఐదేళ్లు పూర్తి చేసుకున్నానని, ఆ సంబరాల నుంచి తేరుకోకముందే ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. వాలియా కంపెనీ మీటింగ్ కోసం సిద్ధమవుతున్న క్రమంలో ఆమె కంప్యూటర్‌పై మెసేజ్ కనిపించింది. అందులో ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు మెసేజ్ ఉంది. మీటింగ్‌కు కేవలం 10 నిమిషాల ముందు యాక్సెస్ నిరాకరించారని, తనను ఎందుకు తొలగించారో అర్థం కావడం లేదంటూ లింక్డ్ ఇన్‌లో పోస్టే చేశారు వాలియా.

‘సిగ్నల్ పోయిందనుకున్నా.. కానీ జాబే పోయింది’.. Google ఉద్యోగిని భావోద్వేగంమీరు సూపర్ బాస్.. Googleలో జాబ్ పోతే.. ఏకంగా కొత్త కంపెనీయే పెట్టేస్తున్నారు!Layoffs: ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. 8,500 మందిని పీకేసిన మరో సంస్థ.. భారత్‌లోనూ ప్రభావం!



Source link

Latest news
Related news