Shaheen Afridi: మోకాలి గాయం కారణంగా రెండు నెలలపాటు క్రికెట్‌కు దూరమైన షాహీన్ అఫ్రిదీ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో సత్తా చాటుతున్నాడు. పెషావర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి తనేంటో నిరూపించుకున్నాడు. తొలి ఓవర్ తొలి బంతికే హరీస్ బ్యాట్‌ను ముక్కలు చేసిన షాహీన్.. రెండో బంతికి అతణ్ని బౌల్డ్ చేశాడు. మరుసటి ఓవర్లో పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను సైతం బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో షాహీన్ ముగ్గురు బ్యాటర్లను బౌల్డ్ చేయడం గమనార్హం.