Sunday, April 2, 2023

Rythu Bharosa : రైతుభరోసా.. మూడో విడతగా రూ.1,090.76 కోట్లు రైతుల ఖాతాలకు

మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా సాయం పంపిణీలో భాగంగా.. 51,12,453 మంది రైతులకి రూ. 1,090.76 కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతు ఖాతాల్లో జమ చేస్తారు. వైఎస్సార్ రైతుభరోసా స్కీమ్ ద్వారా… రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ ఏటా రూ. 13,500 పెట్టుబడి సాయంగా అందిస్తోన్న విషయం తెలిసిందే. 2019లో ఈ పథకాన్ని ప్రారంభించారు. 2019 -20 లో 46.69 లక్షల మందికి రూ. 6,173 కోట్లు… 2020-21 ఆర్థిక సంవత్సరంలో 51.59 లక్షల మంది రైతులకి రూ.6,928 కోట్లు… ఇన్వెస్ట్ మెంట్ సపోర్ట్ గా అందించారు. 2021- 22లో 52.38 లక్షల మందికి రూ.7,016.59 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 2022-23లో మొదటి విడతగా మే నెలలో రూ.7,500…. రెండో విడతగా అక్టోబర్ లో రూ. 4 వేలు రైతులకి పంపిణీ చేశారు.

Source link

Latest news
Related news