Friday, March 31, 2023

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా నుంచి స్టార్ రైటర్ ఔట్.. త్రివిక్రమ్ వల్లేనా.. అసలు నిజం ఇదే!

రీసెంట్‌గా టాలీవుడ్‌లో బజ్ క్రియేట్ చేసిన చిత్రం ‘వినోదయ సిత్తం’ (Vinodhaya Sitham) రీమేక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ), ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీలో క్రేజ్ నెలకొంది. ప్రముఖ నటుడు సముద్రఖని (Samuthirakhani) తమిళ్‌లో స్వీయ దర్శకత్వంలో ‘వినోదయ సిత్తం’ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు తెలుగు వెర్షన్‌కు కూడా ఆయనే దర్శకత్వం వహించనుండగా.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తు్న్నారు. అయితే ముందుగా స్టార్ రైటర్ సాయి మాధవ్‌ బుర్రాను (Sai Madhav Burra) డైలాగ్ వెర్షన్ కోసం తీసుకున్నారు. ఆయన కూడా నెల రోజులు సమయం కేటాయించి పని పూర్తిచేశారు. కానీ ఇంతలోనే డైలాగ్స్ త్రివిక్రమ్ రాస్తున్నట్లుగా న్యూస్ బయటికొచ్చింది. దీంతో సాయి మాధవ్‌ను తప్పించారనే న్యూస్ నెట్టింట వైరల్ అయింది.

విషయానికొస్తే.. ‘వినోదయ సిత్తం’ రీమేక్‌కు సంబంధించి స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేశారు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసిన త్రివిక్రమ్.. ఫైనల్ స్క్రిప్ట్‌ను డైలాగ్ రైటింగ్ కోసం సాయి మాధవ్‌కు అప్పగించారు. ఇక సాయి మాధవ్ అందించిన డైలాగ్స్‌కు త్రివిక్రమ్, సముద్రఖని ఇద్దరూ శాటిస్‌పై అయ్యారు. కానీ పవన్ పాత్ర సాయి ధరమ్ తేజ్ కంటే తేలికగా ఉందని భావించి, రీరైట్ చేయమని కోరారట. అయితే ఇప్పటికే ఒప్పుకున్న కమిట్‌మెంట్స్ కారణంగా త్రివిక్రమ్ రిక్వెస్ట్‌ను తిరస్కరించిన సాయి మాధవ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని సమాచారం.

దీంతో ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ రైటర్‌గా మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబుతో SSMB28 మూవీతో బిజీగా ఉన్నప్పటికీ.. పవన్‌ స్టార్‌డమ్‌కు తగ్గట్లుగా డైలాగ్స్ ఉండాలని భావించి మరోసారి పవర్ స్టార్ సినిమా భారాన్ని తనపై వేసుకున్నారని టాక్. ఇక త్రివిక్రమ్ గతంలోనూ ఇతర దర్శకులు పవన్‌తో తీసిన ‘తీన్‌‌మార్, భీమ్లా నాయక్’ చిత్రాలకు స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు.

ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి కేవలం 30 రోజులు డేట్లు కేటాయించినట్లు పవన్.. ఇందుకోసం రూ. 75 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో పవన్ వీలైనంత త్వరగా ఒప్పుకున్న సినిమాలన్నీ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇవేకాక పవన్.. హారీష్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, సుజిత్‌తో ‘OG’ చిత్రాలు కమిట్ అయిన విషయం తెలిసిందే.

Latest news
Related news