ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్ లో 7 ఎమ్మెల్సీ స్థానాలకు.. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి. ఏపీలో నారా లోకేశ్, పోతుల సునీత, బత్తుల అర్జునుడు, డొక్కా మాణిక్య వర ప్రసాదరావు, వరాహ వెంకట సూర్య నారాయణ రాజు, గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. మరో సభ్యుడైన ఎమ్మెల్సీ ఛల్లా భగరీథ రెడ్డి గతేడాది నవంబర్ లో కన్నుమూయడంతో… అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇక… తెలంగాణలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్ ల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది.
BREAKING NEWS