తాను నెలకి రూ.15 వేలు మాత్రమే శాలరీ తీసుకుంటున్నట్లు ఇటీవలే వెల్లడించారు క్రెడ్ సీఈఓ కునాల్ షా (CRED CEO Kunal Shah). ఈ క్రమంలో అంత తక్కువ జీతం తీసుకునేందుకు కారణమేంటని ప్రశ్నలు తలెత్తాయి. ఈ విషయంపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ షేర్ చేశారు కునాల్ షా. తమ ఫిన్‌టెక్ కంపెనీ లాభాలబాట పట్టే వరకు పెద్ద మొత్తంలో జీతం తీసుకోకుడాదని నిర్ణయించుకున్నట్లు రాసుకొచ్చారు. ‘కంపెనీ లాభదాయక స్థితికి వచ్చే వరకు నాకు మంచి జీతం వస్తుందని నేను నమ్మను. క్రెడ్‌లో నా జీతం నెలకి రూ.15,000. దాంతో నాకు జీవిచంగలగుతున్నా. గతంలో కంపెనీ ఫ్రీఛార్జ్ విక్రయించాను. ఆ డబ్బులు ఉన్నాయి.’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు కునాల్ షా.
ఈ క్రమంలో కునాల్ షా శాలరీపై సామాజిక మాధ్యమాల్లో చర్చ కొనసాగుతోంది. సీఈఓలు కోట్ల రూపాయలు జీతంగా తీసుకుంటున్న సమయంలో మనకు కునాల్ షా ఉన్నాడు అంటూ నో ట్విట్టర్ యూజర్ రాసుకొచ్చారు. కునాల్ షా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేశారు అజీత్ పటేల్ అనే యూజర్. మరోవైపు.. కొందరు ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు అసలు కథ వేరే ఉందని పేర్కొంటున్నారు. ట్యాక్స్ నుంచి తప్పించుకునేందుకు తక్కువ జీతం తీసుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు. అయితే, వందల కోట్లు విలువైన తన స్టార్టప్ కంపెనీని అమ్మేశారని, దీంతో ఆయన వద్ద కుప్పలు తెప్పలుగా డబ్బులు ఉన్నాయని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
Also Read: Nokia: నోకియాలో కీలక మార్పులు.. 60 ఏళ్లలో కంపెనీ చరిత్రలో తొలిసారి.. ఎందుకోసమంటే?
- Read Latest Business News and Telugu News