Friday, March 31, 2023

Jasprit Bumrah: IPLతోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు బుమ్రా దూరం..!

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన భారత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరడం దాదాపు ఖాయమైంది. మిగతా రెండు టెస్టుల్లో ఒక్క విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకుంటుంది. చివరి రెండు టెస్టులను డ్రాగా ముగించిన ఫైనల్ చేరే అవకాశం ఉంది. జూన్ ఏడో తేదీన ఓవల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుండగా.. కీలకమైన ఈ పోరులోనూ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దగే అవకాశం కనిపించడం లేదు.

ఐపీఎల్ నాటికి బుమ్రా ఫిట్‌నెస్ సాధిస్తాడని భావించగా.. అది కష్టమేనని తెలుస్తోంది. బీసీసీఐ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకూ బుమ్రా కోలుకోవడం కష్టమే. ఇది టీమిండియాతోపాటు ముంబై ఇండియన్స్‌కు కచ్చితంగా బ్యాడ్ న్యూసే.

గాయం కారణంగా బుమ్రా 2022 సెప్టెంబర్ నుంచి భారత జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో ఆడినప్పటికీ.. గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌ నాటికి ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు. భారత ప్రధాన బౌలింగ్ ఆప్షన్ అయిన బుమ్రా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం కావడం ఆందోళన కలిగించే అంశమే.

బుమ్రాను నేషనల్ క్రికెట్ అకాడమీ జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది. అతడి విషయంలో తొందరపడొద్దని భావిస్తోంది. అతడు తిరిగి భారత జట్టులోకి ఎప్పుడు అడుగుపెడతాడనే విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ.. వెస్టిండీస్ పర్యటన నాటికి లేదంటే ఆసియా కప్ నాటికి అతడు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ నాటికి బుమ్రా ఫిట్‌‌నెస్ సాధించాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.

బుమ్రా ఐపీఎల్2కు దూరం కావడం ముంబై ఇండియన్స్ భారీ దెబ్బగానే చెప్పొచ్చు. ముంబై జట్టులో బుమ్రా కీలక ఆటగాడు. గత కొన్నేళ్లుగా ముంబై విజయాల్లో అతడు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. జోఫ్రా ఆర్చర్ ఫిట్ అయినప్పటికీ.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇంకా తీసుకోవాల్సి ఉంది. దీంతో అతడు 2023 సీజన్ మొత్తం ముంబై ఇండడియన్స్‌కు ఆడటం అనుమానమే. కామెరాన్ గ్రీన్ సైతం గాయాలతో బాధపడుతున్నాడు.

Latest news
Related news