Meghalaya, Nagaland Assembly Polling: ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల యుద్ధం నేడు (ఫిబ్రవరి 27) జరగనుంది. మేఘాలయ (Meghalaya Election), నాగాలాండ్ (Nagaland Election) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు జరగనుంది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. మేఘాలయలోని 60 సీట్లకు గాను 59 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. నాగాలాండ్‍లోనూ 59 చోట్ల ఓటింగ్ ఉండనుంది. మేఘాలయలో మళ్లీ అధికారం చేపట్టాలని నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) పట్టుదలగా ఉంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ప్రతిపక్షాలుగా ఉన్నాయి. నాగాలాండ్‍లో తిరిగి పట్టు సాధించాలని అధికార నేషనలిస్ట్ డెమోక్రాటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (NDPP) ప్రయత్నిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో నేటి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 4 వరకు సాగుతుంది.