వెల్లుల్లి..

ఫుడ్ సైన్స్, బయోటెక్నాలజీ అధ్యయనం ప్రకారం వెల్లుల్లిలో యాంటీథ్రాంబోటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. అందుకే.. వెల్లుల్లని న్యాచురల్ ఆస్పిరిన్ అని కూడా పిలుస్తారు. వెల్లుల్లిని మన ఆహారంలో తరచుగా తీసుకుంటే.. రక్తం చిక్కపడకుండా ఉంటుంది. రక్తనాళాలు, గుండెలో అడ్డంకులను నివారిస్తుంది. మీ ఆహారంలో, పాలలో, కాల్చిన వెల్లుల్లని తీసుకున్నా మంచిదే. వెల్లుల్లిలోని యాంటీబయాటిక్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు అనేక అనారోగ్యాల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. (Image: istock)
అల్లం..

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో గడ్డలు ఏర్పడకుండా నిరోధిస్తాయి. అల్లంలోని సాలిసైలేట్ యాసిడ్ సహజ బ్లడ్ థిన్నర్స్‌లా సహాయపడతాయి. వీటిని ఆస్పిరిన్ సాలిసైలేట్, ఎసిటైల్సాలిసిలిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. అల్లం తేనలో నానబెట్టి తీసుకుంటే మంచిదన ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అల్లం రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూసుకుంటుంది. ఇది స్ట్రోక్, హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకుంటుంది.
పసుపు..

పసుపు యాంటిసెప్టిక్, దీనిలోని కర్కుమిన్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తం గడ్డకట్టకుండా చూసుకుంటుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన ఫలకాన్ని తొలగించే శక్తి పసుపుకు ఉంది. పసుపులో యాంటీ మైక్రోబియల్, యాంటీ కోగ్యులెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. EPMA జర్నల్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం రక్తం గడ్డకట్టకుండా నిరోధించడంలో పసుపు సహాయపడుతుంది. మీ ఆహారంలో పసుపు చేర్చుకోండి. రోజు పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే మంచిది.
ఉలవలు..

ఉలవలు.. వీటిని పశువులకు దానగా మాత్రమే పెడతారని చాలా మంది అనుకుంటారు. కానీ ఇవి మన డైట్‌లో చేర్చుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఉలవలు పెద్దపేగులో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తనాళాలు మూసుకుపోకుండా చూసుకుంటుంది.దీనిని ఫ్రీబయోటిక్ అంటారు. ఉలవల్లో ఫినాలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ కరగడానికి సహాయపడుతుంది. ఇవి లితోజెనిక్ బైల్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. ఉలవలతో చారు, వలడలు చేసుకుని తినవచ్చు. మీటి మొలకలతోనూ కర్రీ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు.
పైన పేర్కొన్న పదార్థాలు మీ ఆహారంలో తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తంలో అడ్డంకులు ఏర్పడవు. మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్ నివారించవచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.