జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే వంద శాతం ఆహ్వానిస్తామంటూ లోకేశ్ ఆన్సర్ ఇచ్చారు. ఇదే సమయంలో కొన్ని కామెంట్స్ చేశారు. ఏపీ రాజకీయాల్లో సానుకూలమైన మార్పు తీసుకురావాలన్న తపన ఉన్నవారు…ఎవరు వచ్చినా తాను స్వాగతిస్తానంటూ మాట్లాడారు. ఇక్కడ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పకుండానే ఈ వ్యాఖ్యలు చేశారు లోకేశ్. అయితే టీడీపీ స్థాపకుడు, సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా పేరొందిన జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సర్వత్రా చర్చ జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేశ్ స్వాగతించటం తెలివైన జవాబే కావొచ్చు… కానీ మరోవైపు అదే జూనియర్ ఎన్టీఆర్… లోకేశ్ రాజకీయ భవిష్యత్తుకు అవరోధంగా మారుతారన్న భావన కూడా ప్రస్తుత టీడీపీ నాయకత్వంలో ఉందనే వాదన తెరపైకి వస్తోంది. ఇక వారసత్వ పోరులో ఉద్దేశపూర్వకంగానే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు… సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చంద్రబాబు పక్కన పెట్టారనే వాదన కేడర్ లో ఎప్పట్నుంచో ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో లోకేశ్ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయనే చర్చ నడుస్తోంది.
BREAKING NEWS