Pawan Kalyan – Ram Charan: టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను జనసేనాని పవన్ కళ్యాణ్ అభినందించారు. అందుకు కారణం RRR సినిమా. ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్‌లో (HCA Awards 2023) ఈ చిత్రం ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ వేడుకల్లో చరణ్ వాయిస్, మోషన్ క్యాప్చర్స్ విభాగంలో అవార్డులను ప్రకటించి అందించారు. ఉత్తమ ఇంటర్నేషనల్ మూవీని అవార్డు కేటగిరీలో RRRకి వచ్చిన అవార్డును రాజమౌళి (Rajamouli), రామ్ చరణ్ కలిసి అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జనసేనని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి, RRR టీమ్‌కు ప్రత్యేకంగా అభినందించారు.
‘‘ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో RRR పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకం. ఈ వేదికపై ‘బెస్ట్ వాయిస్, మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్’ ను రామ్ చరణ్ ద్వారా ప్రకటింపచేయడం, స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం సంతోషాన్ని కలిగించింది.ఈ సందర్భంగా రామ్ చరణ్, దర్శకులు రాజమౌళి, చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. చరణ్ మరిన్ని మంచి చిత్రాలు చేసి అందరి మన్ననలు పొంది ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు పవన్ కళ్యాణ్.
ఆర్ఆర్ఆర్ సినిమాకు వస్తున్న స్పందనతో రామ్ చరణ్ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. గత ఏడాది వసూళ్ల పరంగా రికార్డులను క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు అవార్డుల రేసులో దూసుకెళ్తోంది. ఏకంగా హాలీవుడ్ చిత్రాలతోనే మన తెలుగు సినిమా పోటీపడటం తెలుగు వారిగా ఎంతో గర్వించాల్సిన సమయం. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న RRR ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ సాంగ్ కేటగిరీలోనూ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐదు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను సినిమా దక్కించుకుంది.
ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మార్చి 3న అమెరికాలోని 200 స్క్రీన్స్‌లో రీ రిలీజ్ చేయబోతున్నారు. మరో వైపు త్వరలోనే రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణిలతో పాటు ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ ఈవెంట్స్‌లో జాయిన్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ALSO READ:
నాతో పాటు నా తమ్ముడు తారక్ కూడా.. అరుదైన ఘనతపై రామ్ చరణ్ రియాక్షన్.. ఆనంద్ మహీంద్ర ప్రశంస