Tuesday, March 21, 2023

mphasis, IT Freshers: ఇంకెన్నాళ్లు ఈ వెయిటింగ్.. ఉద్యోగాలు ఇవ్వరా? ఐటీ కంపెనీ ఫ్రెషర్ల ఆందోళన – it company mphasis freshers feel the heat at mphasis claim delay in onboarding process


IT Freshers: ఆర్థిక మాంద్యం భయాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఐటీ, టెక్ కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు వేలాది మందిని తొలగించాయి. ఉన్నవారి జీతాల్లో కోత పెడుతున్నాయి. ఈ క్రమంలో కొత్త నియమకాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఇప్పటికే కొత్త వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చిన విప్రో కొత్త మెలిక పెట్టిన సంగతి తెలిసిందే. వారి ప్యాకేజీల్లో భారీగా కోత పెట్టి ఇష్టం ఉన్నవారు ఉద్యోగాల్లో చేరాలని కోరింది. ఇప్పుడు అలాంటి పరిస్థితే మరో కంపెనీ ఫ్రెషర్స్‌కి (IT company) ఎదురైంది. ఉద్యోగాలకు ఎంపిక చేసి ఆఫీసులకు పిలిపించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రముఖ ఐటీ కంపెనీ ఎంఫసిస్ (Mphasis) తమను ఉద్యోగాలకు ఎంపిక చేసిన ఆన్‌బోర్డింగ్ చేయించకుండా జాప్యం చేస్తోందని ఆ సంస్థ ఫ్రెషర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు ట్విట్టర్ వేదికగా పోస్టుల రూపంలో వెల్లడిస్తున్నారు. కంపెనీ తమకు అపాయింట్‌మెంట్ పత్రాలు ఇచ్చినా ఉద్యోగం లోకి తీసుకోవడం లేదని, వాటిపై పేర్కొన్న సమయం సైతం అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమను ఉద్యోగంలోకి తీసుకుంటారో లేదోనని ఆందోళన చెందుతున్నారు.

ఈ విషయాన్ని నితిన్ రాకేష్ అనే ఐటీ ఫ్రెషర్ (IT Freshers) ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కంపెనీ నుంచి 2021 అక్టోబర్‌లో అపాయింట్‌మెంట్ లేటర్ అందుకున్నానని, అప్పటి నుంచి జాయినింగ్ కోసం వేచి చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. కంపెనీ అంగీకార పత్రం అందుకున్న నేపథ్యంలో తాను ఒక ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగిగా మారబోతున్నని సంతోషపడ్డానని, కానీ, ఆ కోరిక తీరేలా కనిపించడం లేదని పేర్కొన్నాడు. తనను సంస్థ ఆన్‌బోర్డ్ చేయకుండా ఎంఫసిస్ కంపెనీ నిరాశకు గురి చేస్తోందని వాపోయాడు. ఇప్పటికైన ఆన్‌బోర్డ్ చేసి ఉద్యోగంలోకి తీసుకోవాలని వేడుకుంటున్నాడు.

మరోవైపు.. జూన్ 2022లో కంపెనీ నుంచి లేటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) అందుకున్న విషయాన్ని వెల్లడించాడు ఇంకో అభ్యర్థి. తనకు అందిన లేఖలో మార్చి, 2023 వరకు గడువు ఇచ్చారని తెలిపాడు. మార్చి సమీపిస్తున్నా తనను ఆన్‌బోర్డ్ చేసుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నాడు. మరోవ్యక్తి తాను 16 నెలల నుంచి ఆన్‌బోర్డింగ్ కోసం వేచి చూస్తున్నట్లు రాసుకొచ్చాడు. ఎంఫాసిస్‌లో ఉద్యోగం వచ్చిందన్న కారణంతో చాలా ఆఫర్స్ తిరస్కరించానని, ఇప్పుడు తన పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంఫసిస్ కంపెనీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి తనలాంటి వారిని వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని వేడుకుంటున్నాడు.

ఇలా ఉద్యోగాల కోసం వెయిటింగ్ చేస్తున్న ఫ్రెషర్ల ట్వీట్లకు కంపెనీ నుంచి ఆటోమేటిక్ రెస్పాన్స్ వచ్చింది. ‘మీ స్పందనకు థ్యాంక్యూ. మీ సమస్యను campushires@mphasis.com ద్వారా మాకు తెలియజేయండి. మీ ఆఫర్ లెటర్‌పై ఉన్న రిఫరెన్స్ నంబర్ పేర్కొనండి. అది మీ వివరాలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది’ అనే రిప్లై వచ్చింది.

Wipro: ఐటీ దిగ్గజం విప్రో అంత పనిచేసిందా? తీవ్ర నిరాశలో వేలాది మంది ఫ్రెషర్స్.. అసలేం జరిగిందంటే?Wipro నిర్ణయంపై చెలరేగిన దుమారం.. అన్నీ ఏకమై నిరసన.. ఇప్పుడేం చేస్తుందో?Wipro: ఉద్యోగుల వేతనాలు సగానికి తగ్గించిన విప్రో.. తీవ్రంగా మండిపడుతున్న నెటిజెన్లు.. తర్వాత పరిస్థితి అదేనంటూ..!Source link

Latest news
Related news