Sunday, April 2, 2023

icici bank, FD Interest Rates: ఐసీఐసీఐ బ్యాంక్ కీలక ప్రకటన.. డబ్బులు దాచుకుంటే అధిక వడ్డీ.. వారికే ఎక్కువ లాభం.. – icici bank hikes fd interest rates by up to 50 bps


FD Interest Rates: ఇటీవల దిగ్గజ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఇప్పుడు మరో దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ ICICI Bank కూడా తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. రూ. 2 కోట్లకు లోబడిన రిటైల్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన టెన్యూర్‌లపై గరిష్టంగా 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచడం విశేషం. ఇక పెంచిన వడ్డీ రేట్లతో ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్.. 7 నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 7.10 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. ఇది సాధారణ పౌరులకు కాగా.. సీనియర్ సిటిజెన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల మేర ప్రయోజనం దక్కనుంది. ఇక.. పెంచిన వడ్డీ రేట్లు ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తన అధికారిక వెబ్‌‌సైట్లో పేర్కొంది.

రిటైల్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన తర్వాత.. 7 రోజుల నుంచి 29 రోజుల్లో ముగిసే ఎఫ్‌డీలపై 3 శాతం వడ్డీ అందిస్తోంది. ఇక 30 నుంచి 45 రోజుల కాలవ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీ అందుతోంది. 46-60 రోజుల టెన్యూర్ ఉన్న FD లపై 4.25 శాతం వడ్డీ ఇస్తోంది. ఇక 91 రోజుల నుంచి 184 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మాత్రం 4.75 శాతం మేర వడ్డీ అందిస్తోంది ఐసీఐసీఐ బ్యాంక్.

ChatGPT: మీరు చాట్‌జీపీటీ వాడుతున్నారా? అయితే రిస్క్‌లో మీ ఇన్‌స్టాగ్రామ్, Gmail సమాచారం.. ఎలాగంటే?భారతీయులకు టాలెంట్‌పై ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు.. Ajay Banga ట్రూ ఏజెంట్ అంటూ!

185-270 రోజుల టెన్యూర్ ఉన్న FD లపై 5.75 శాతం వడ్డీ, 271 రోజుల నుంచి ఏడాది లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6 శాతం వడ్డీ ఇస్తోంది. ఏడాది నుంచి 15 నెలల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.70 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక 15 నెలల నుంచి రెండేళ్ల లోపు వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మాత్రం అత్యధికంగా 7.10 శాతం వడ్డీ అందిస్తోంది. ఇక రెండేళ్ల నుంచి ఐదేళ్ల వ్యవధి ఉన్న FD లపైనా 7 శాతం మాత్రమే వడ్డీ వస్తోంది. సీనియర్లకు ఇక్కడ అత్యధికంగా 7.50 శాతం, అదే 15 నెలల నుంచి 18 నెలల లోపు.. 18 నెలల నుంచి రెండేళ్ల లోపు FD లపై సీనియర్ సిటిజెన్లకు ఏకంగా 7.60 శాతం వడ్డీ ఇస్తోంది ఐసీఐసీఐ. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ FD స్కీమ్ కింద.. మరో 10 బేసిస్ పాయింట్ల మేర అదనపు ప్రయోజనం దక్కనుంది.



Source link

Latest news
Related news