ఫేస్‌బుక్ లవ్..

నిజానికి ఇదంతా.. సోషల్ మీడియాలో చాలా మంది మహిళలు మోసపోతున్న టైమ్ నాటిది. అలాంటి పరిస్థితుల్లో నేను కూడా ప్రేమ వ్యవహారానికి దూరంగా ఉన్నాను. ఒకరినొకరు బాగా తెలుసుకున్న తర్వాత కూడా నేను స్ట్రెంజర్‌తో సంబంధం పెట్టుకోవడానికి సిద్ధంగా లేకపోవడానికి ఇది కూడా ఒక కారణం. అయితే.. అంతా కూడా ఇలా హఠాత్తుగా మారిపోతుందని నాకు తెలియదు.
నిజానికి ఇది 2016లో మొదలైంది. అతను నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు, నేను యాక్సప్ట్ కూడా చేశాను. మేము ఫేస్‌బుక్‌లోనే ఇష్టాలు, అయిష్టాలు షేర్ చేసుకున్నాం. మా పనికి సంబంధించిన విషాయాల గురించి మాట్లాడుకున్నాం. తను నాకు చాలా నచ్చాడు. నిజం చెప్పాలంటే, నేను అతనికి చాలా ఎట్రాక్ట్ అయ్యాను. కానీ ఆ తర్వాత కూడా నేను అతనికి దూరంగానే ఉన్నాను. అయినా పగలూ రాత్రీ మాట్లాడుకునేవాళ్ళం. మా రిలేషన్ మరింత స్ట్రాంగ్ అయ్యింది. (image source – pixabay)
డేట్‌కు పిలిచాడు..

ఒకరోజు అతను నన్ను డేట్‌కు పిలిచాడు. నేను, షాక్ అయ్యాను. కానీ, నేను అతనితో డేట్‌కు అంగీకరించాను. మేము ఒకే సీటీలో ఉన్నప్పటికీ, మేము ఒకరినొకరు కలుసుకోలేదు. నా పరిమితులు నాకు తెలుసు కాబట్టి కావచ్చు. అయినా నన్ను కలవమని అడుగుతూనే ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో, అతను పట్టుబట్టినప్పుడు, నేను అతనిని కలవడం ఇష్టం లేదని మర్యాదగా చెప్పాను, ఎందుకంటే అపరిచితుల వల్ల మోసపోతారనే భయం నా మనస్సులో ఎప్పుడూ ఉంటుంది. నా మాట విని అతను ఏమీ మాట్లాడలేదు.
అయితే, ఇంత జరిగిన తర్వాత కూడా మా మధ్య మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. కాలేజీ చదువుల కోసం వేరే దేశానికి వెళ్లాను. అక్కడి నుంచి కూడా మా ఇద్దరి కాంటాక్‌లోనే ఉన్నాం. అయితే కొన్నాళ్లకే నేనూ అతనిని ఇష్టపడడం, నమ్మడం మొదలుపెట్టాను. (image source – pixabay)
ప్రపోజ్ చేశాడు..

నేను మన దేశానికి తిరిగి వచ్చాను. అతను కేఫ్‌లో నాకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. మొదటిసారి అతన్ని డైరెక్ట్‌గా చూశాను. చాకు చాలా నచ్చాడు. నాకు అతని మీద ప్రేమ ఇంకా పెరిగింది. మేం కలిసిన వెంటనే నాకు పెళ్లి ప్రపోజ్ చేశాడు. అది విని ఆశ్చర్యపోయాను, దాని గురించి తర్వాత మాట్లాడమని చెప్పాను. అది అతన్ని చాలా బాధించిందని నాకు తెలుసు. కానీ నేను తొందరపడి అంత పెద్ద అడుగు వేయలేకపోయాను. (image source – pixabay)
మా ఇంటికి వచ్చేశాడు..

కొన్ని రోజుల తర్వాత సెడన్‌గా మా ఇంటికి వచ్చాడు. నేను చాలా భయపడ్డాను. నా పేరెంట్స్ ఈ విషయం గురించి ఏమీ తెలియదు. కానీ, కొంతసేపటి తర్వాత మా అమ్మకు ఈ రిలేషన్ గురించి అర్థమైంది. నా పేరెంట్స్.. మా రిలేషన్‌ను అంగీకరించారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ, నాకు ఇంకా ఏదో భయంగా ఉంది. మా తల్లిదండ్రులు మా పెళ్లికి కూడా అంగీకరించారు. బహుశా అతని వ్యక్తిత్వం, ప్రవర్తన వాళ్లకి బాగ నచ్చడం వల్ల కావచ్చు. అతనితో పెళ్లికి కూడా ఓకే చెప్పాను. అతను నాతో చాలా సంతోషంగా ఉన్నాడు. మాకు పెళ్లయి రెండేళ్లు కావస్తోంది, చాలా సంతోషంగా ఉన్నాము. అతను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నేను అతన్ని ఎందుకు ఇలా జడ్జ్ చేశానో నాకు అర్థం కావట్లేదు. సోషల్ మీడియా రొమాన్స్ ఇంత ఎక్సైటింగ్‌గా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. (image source – pixabay)