Friday, March 24, 2023

Disha Patani: ఇన్నర్‌వేర్‌లో లోఫర్ బ్యూటీ.. ఆ స్టోర్‌లో కలుస్తానంటూ ట్వీట్!

పూరీ జగన్నాథ్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లోఫర్’ (Loafer) మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ ‘దిశా పటానీ’ (Disha Patani). ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించనప్పటికీ బాలీవుడ్‌లో మాత్రం పలు సినిమాల్లో నటించింది. అయితే, సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ గుర్తింపు పొందిన ఈ బ్యూటీ.. హాట్ ఫొటో షూట్స్‌తో అంతకుమించి పాపులర్ అయింది. పర్ఫెక్ట్ ఫిజిక్ ఉండటమే తనకు ప్లస్ పాయింట్ కాగా.. ఈ ఒక్క విషయంలోనే తోటి హీరోయిన్ల కంటే పై చేయి సాధించింది. కానీ ఎన్ని అందాలు ప్రదర్శించినా క్రేజీ ప్రాజెక్టుల్లో పెద్దగా చాన్స్‌లు దక్కడం లేదు. అయితే తన ప్రయత్నాన్ని మాత్రం ఆపని దిశ.. ఎప్పటికప్పుడు నెటిజన్లకు హాట్ ట్రీట్ పంచుతూ.. వార్తల్లో ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్నర్‌వేర్‌లో పోజులు ఇవ్వగా.. ఈ పిక్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

ప్రతిసారి సెక్సీ ఫొటో షూట్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసే దిశ.. ఈసారి కాస్త కమర్షియల్ యాంగిల్ యాడ్ చేసింది. ఆమె ధరించిన బ్రా, అండర్‌వేర్‌ను హైలైట్ చేస్తూ ఇచ్చిన పోజు యువ హృదయాలను కొల్లగొడుతోంది. అయితే ఈ ఇన్నర్‌వేర్‌ కాల్విన్ క్లీన్ (Calvin Klein) బ్రాండ్‌కు చెందినవి కాగా.. దీనికే (CK Brand) ఆమె ప్రచారం చేస్తోంది. ఈ మేరకు ఈ ఫొటోతో పాటు ‘హే.. ముంబై. ఫిబ్రవరి 24న BKC, జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌లోని Calvin Klein స్టోర్‌లో సాయంత్రం 4 గంటలకు మిమ్మల్ని కలిసేందుకు వెయిట్ చేయలేకపోతున్నాను’ అని పోస్ట్ చేసింది.

మొత్తానికి దిశా పటానీ ఈ పిక్‌లో తన ప్యాంట్‌ను కిందకులాగి అండర్‌వేర్ కనిపించేలా మత్తెక్కించే చూపులతో స్టిల్ ఇచ్చింది. అంతేకాదు ఈ ఫొటోలో ఆమె తన బాడీ కర్వ్స్ ప్రదర్శించి అభిమానులకు కావలసినంత మజా పంచింది. ఇదిలా ఉంటే.. తను కొంతకాలం బీటౌన్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులు చాలా క్లోజ్‌గా తిరిగిన ఈ జంట గురించిన న్యూస్ ఈ మధ్య వినిపించడం లేదు. దాదాపు బ్రేకప్ అయినట్లేనని సమాచారం.

ఇక సినిమాల విషయానికొస్తే.. దిశా పటాని నెక్స్ట్ ‘యోధ’ చిత్రంలో కనిపించనుంది. పుష్కర్ ఓజా, సాగర్ అంబ్రే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ మల్హోత్రా, షాహిద్ కపూర్, రాశీ ఖన్నాతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఈ మూవీ జూలై 7న విడుదల కానుంది. మరోవైపు సౌత్‌ స్టార్ హీరో సూర్యకు జోడీగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ నటిస్తోంది దిశ. అంతేకాదు డార్లింగ్ స్టార్ ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

Latest news
Related news