How to close credit card through website: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డును వెబ్‌సైట్ ద్వారా క్లోజ్ చేయొచ్చు.
తొలుత వెబ్‌సైట్లో చాట్‌బాట్- Ask Eva అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయాలి.
Credit Card Closure అని టైప్ చేయాలి.
మీ పదంకెల మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ అక్కడ ఎంటర్ చేయాలి.
మీ క్రెడిట్ కార్డు చివరి నాలుగంకెలు నమోదు చేయాలి.
కారణం ఎంచుకోవాలి.
అప్పుడు మీ క్రెడిట్ కార్డు క్లోజర్ రిక్వెస్ట్ బ్యాంకుకు వెళ్తుంది.
HDFC బ్యాంకుకు వెళ్లడం ద్వారా.. క్రెడిట్ కార్డు ఎలా క్లోజ్ చేసుకోవాలో చూద్దాం. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కూడా క్రెడిట్ కార్డును క్లోజ్ చేయడం చాలా సులువు. బ్యాంకులో ఒక క్రెడిట్ కార్డు క్లోజర్ ఫామ్ తీసుకొని.. దానిని ఫిల్ చేసి మేనేజర్‌కు సబ్మిట్ చేయాలి. మీరు మేనేజర్‌కు పంపిన క్రెడిట్ కార్డు క్లోజర్ ఫామ్‌ను డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.
ఫోన్ బ్యాంకింగ్ ద్వారా.. బ్యాంకింగ్ నంబర్ల ద్వారా కూడా క్రెడిట్ కార్డును క్లోజ్ చేయొచ్చు. ఇది ఎలాగంటే..
మీ టెలిఫోన్ ఐడెంటిఫికేషన్ నంబర్ (TIN) వాలిడేట్ చేసుకోవాలి. ఇది ఫోన్ బ్యాంకింగ్ సర్వీసుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ మీకు అందించే నాలుగంకెల నంబర్.
క్రెడిట్ కార్డు బ్లాక్ లేదా క్లోజ్ చేయడం ఎలాగో అక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో కావాలి.
నెట్‌బ్యాంకింగ్ ద్వారా..
నెట్‌బ్యాంకింగ్ ఐడీ, పాస్‌వర్డ్‌తో.. హెచ్‌డీఎఫ్‌సీ నెట్ బ్యాంకింగ్ లాగిన్ చేయాలి.
క్రెడిట్ కార్డ్స్ ట్యాబ్ ఓపెన్ చేసి అక్కడ ఎడమవైపు క్రెడిట్ కార్డ్ హాట్‌లిస్టింగ్‌పై క్లిక్ చేయాలి. మీ నెట్‌బ్యాంకింగ్‌పై ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయో అక్కడ కనిపిస్తాయి.
హాట్‌లిస్ట్ చేయాలనుకుంటున్న క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి.
కారణం ఎంచుకోవాలి.
కార్డును రీఇష్యూ చేయాలనుకుంటే కూడా అక్కడ ఆప్షన్ ఉంటుంది.
- Read Latest Business News and Telugu News