FD Rates Hike: ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. రూ. 2 కోట్లకు లోబడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పుడు డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్లపై 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ముగిసే వాటికి 4 శాతం నుంచి 6.25 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఇది సాధారణ ప్రజలకు కాగా.. సీనియర్ సిటిజెన్లు అధిక లాభం పొందనున్నారు. వారికి 4.50 శాతం నుంచి 6.75 శాతం వడ్డీ అందుతుంది. అంటే.. సాధారణ పౌరులతో పోలిస్తే 50 బేసిస్ పాయింట్ల మేర అధిక ప్రయోజనం దక్కనుంది. ఇక ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధిలో ముగిసిపోయే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధికంగా 6.75 శాతం వడ్డీ అందనుంది. ఇది సీనియర్ సిటిజెన్లకు 7.25 శాతం కావడం విశేషం.
ఇక ఏ కాలవ్యవధులపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 7-14 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనిష్టంగా 4 శాతం వడ్డీ అందిస్తోంది. ఇక 15-45 రోజుల్లో ముగిసే FD పై 4.25 శాతం, 46-90 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఇక 91-179 రోజుల్లో ముగిసిపోయే డిపాజిట్లపై 5 శాతం వడ్డీ ఇస్తోంది. ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధి ఉన్నవాటిపైనే అధికంగా వడ్డీ ఇస్తున్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 2-3 సంవత్సరాల FD లపై 6.50 శాతం వడ్డీ, 3 నుంచి 10 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ ఇస్తోంది.
ChatGPT తో ఉద్యోగాలు పోతాయా? కీలక ప్రకటన చేసిన ఐటీ కంపెనీ TCS.. ఊపిరి పీల్చుకుంటున్న ఫ్రెషర్లు!
ఇక సీనియర్ సిటిజెన్లు.. అంటే 60 సంవత్సరాలు పైబడిన వారికి సాధారణ పౌరులతో పోలిస్తే అన్ని డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువ వడ్డీ దక్కనుంది. ఇక వీటితో పాటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కొన్ని స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను కూడా లాంఛ్ చేసింది. ఇందులో 444 రోజులు, 555 రోజులు, 999 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇందులో కాలెబుల్, నాన్- కాలెబుల్ ఆప్షన్లు ఉన్నాయి. కాలెబుల్ స్కీమ్ కింద 444 రోజుల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 7.35 శాతం వడ్డీ అందనుంది. 555 రోజుల్లో మెచ్యూర్ అయ్యే FD లపై 7 శాతం, 999 రోజుల్లో ముగిసిపోయే డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ అందుతుంది. ఇందులో మళ్లీ సీనియర్ సిటిజెన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల మేర అధికంగా వడ్డీ అందుతుందన్న విషయం మర్చిపోవద్దు.
Google Layoffs: ఆ సంబరాల్లో ఉండగానే ఉద్యోగం పోయింది.. ఇంతకంటే ఘోరం ఉంటుందా.. అయ్యో పాపం!