‘రామ్ చరణ్‌ను చూసి ఈర్ష్యనా? లేక ఇది జెలసీ వల్ల వచ్చిన మౌనమా? చరణ్.. చరణ్.. చరణ్! ఇప్పుడు ఇదే నేమ్ త్రూ అవుట్ వరల్డ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది, కానీ సినిమా కులం మాత్రం తమకేమీ పట్టనట్టుగా చూస్తూ ఉంది’ అని ట్వీట్ చేసింది. విషయానికొస్తే.. HCA అవార్డ్స్ వేదికపై ‘బెస్ట్ వాయిస్, మోషన్ కాప్చర్ పెర్ఫామెన్స్’ను చరణ్ ప్రకటించాడు. అలాగే స్పాట్ లైట్ అవార్డ్ స్వీకరించాడు. దీంతో ఇండియా వైడ్‌గా RRR టీమ్‌తో పాటు రాంచరణ్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. కానీ అరుదైన ఘనతకు మూలమైన టాలీవుడ్ మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఇలాంటి వైఖరిని ఓపెన్‌గా తప్పుబట్టిన యాంకర్ శ్యామల.. అదే విషయాన్ని తన ట్విట్‌లో ప్రస్తావించింది.
అయితే తెలుగు ఇండస్ట్రీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఎప్పటి నుంచో ఉంది. మరొకరి గొప్పతనాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకునే పరిస్థితి లేదు. సాధారణంగా ఏవైనా సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్స్‌లో ‘ఇండస్ట్రీ అంతా ఒక్కటే.. మేమంతా కళామతల్లి బిడ్డలం, మాదంతా సినీ కులం’ అని డైలాగ్స్ కొట్టడమే తప్ప ఇలాంటి సందర్భాల్లోనే అసలు విషయం బయటపడుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఇక యాంకర్ శ్యామల పోస్ట్‌ను రీట్వీట్ చేస్తున్న మెగా అభిమానులు.. బాగా చెప్పారు మేడమ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఎన్ని తరాలు మారినా ఇండస్ట్రీలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని అభిప్రాపడుతున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో కొందరి వాదన నిజమే అనిపించినా.. ఏ ట్వీట్ వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు.
అయితే కొద్ది రోజుల క్రితం చిరంజీవి.. రాంచరణ్ అచీవ్‌మెంట్‌ను పొగుడుతూ RRR చిత్రానికి సంబంధించి కేవలం చరణ్ ఒక్కడినే పొగడటం కూడా విమర్శలకు దారితీసింది. దీంతో తరువాతి ట్వీట్‌కు జాగ్రత్తపడ్డ చిరు.. రాజమౌళి గురించి కూడా నాలుగు ముక్కలు పాజిటివ్‌గా చెప్పి వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయ్నతం చేశారు.
- Read Latest Tollywood Updates and Telugu News