Friday, March 31, 2023

6వ సారి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయిన ఆస్ట్రేలియా మహిళల జట్టు.. గోల్డెన్ ఛాన్స్ చేజార్చుకున్న సౌతాఫ్రికా

Authored by Srinivas Gangam | Samayam Telugu | Updated: 26 Feb 2023, 9:45 pm

Womens T20 World Cup: మహిళల టీ20 ప్రపంచ కప్‌ 2023లో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి మరోసారి ట్రోఫీని ఎగరేసుకుపోయింది.

 

ఆస్ట్రేలియా మహిళా జట్టు సంబరాలు
కీలక టోర్నీల్లో ఒత్తిడిలో చిత్తయ్యే సంప్రదాయాన్ని దక్షిణాఫ్రికా కొనసాగించింది. దేశానికి తొలిసారి ప్రపంచ కప్‌ను అందించే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా మహిళల జట్టు 19 పరుగులతో ఓటమి పాలయ్యారు. ఒత్తిడికి గురై చేతులారా వికెట్లు చేజార్చుకున్నారు. రనౌట్లు కొంపముంచాయి. మెగా టోర్నీల్లో తమకు తిరుగులేదని ఆస్ట్రేలియా మరోసారి నిరూపించింది. ప్రపంచ కప్‌ 2023లో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ వచ్చిన ఆస్ట్రేలియా మరోసారి అద్భుతంగా రాణించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఏకంగా ఆరు సార్లు టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని దక్కించుకున్న మహిళల జట్టుగా రికార్డు సృష్టించింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా ముందు 157 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా.. సౌతాఫ్రికా అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేశారు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

టీ20 వరల్డ్ కప్ 2022 వార్తలు, అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకూ ఈ మెగా టోర్నీ జరగనుంది. ఆస్ట్రేలియాలోని ఏడు వేదికల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించబోతున్నారు. అక్టోబరు 16 నుంచి నవంబరు 6 వరకూ గ్రూప్ దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబరు 9, 10న సెమీ ఫైనల్స్, నవంబరు 13న మెల్‌బోర్న్‌లో ఫైనల్ జరగనుంది.

Latest news
Related news