UGC NET Admit Card 2022: ఐదు సబ్జెక్టులకు ఫేజ్ 2
ఫేజ్ 2 (UGC NET December 2022 phase 2) పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ను ఇప్పడు ఎన్టీఏ విడుదల చేసింది. మొత్తం 5 సబ్జెక్టులకు ఫేజ్ 2 లో యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. 2023 ఫిబ్రవరి 28, మార్చి 1, మార్చి 2 తేదీల్లో ఈ ఫేజ్ 2 పరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ పరీక్ష (UGC NET December 2022 phase 2) ను ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డు (admit card) లను విద్యార్థులు https://ugcnet.nta.nic.in/ . వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నెంబర్, డేటాఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు నోటిఫికేషన్ లోని నియమ నిబంధనలను విద్యార్థులు క్షుణ్నంగా చదవడం మంచిది. అలాగే, తరచు అధికారిక వెబ్ సైట్స్ www.nta.ac.in, https://ugcnet.nta.nic.in లను సందర్శించడం సముచితం.