Thursday, March 30, 2023

నార్మల్ డెలివరీ తర్వాత ఈ సమస్యలు వస్తాయట.. – what are common pelvic floor problems postpartum

ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఆడవారు ఎన్నో లక్షణాలను ఫేస్ చేస్తారు. బిడ్డ పుట్టగానే అన్ని సమస్యలు తగ్గుతాయని అంటారు. కానీ, ఇది నిజం కాదు. ప్రసవం జరిగాక కూడా శరీరం పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో పోషకాహారం అవసరమవుతుంది. గర్భం తర్వాత సాధారణ ప్రసవాలు జరిగే స్త్రీలకు ప్రసవ నొప్పుల సమయంలో అతిగా సాగడం వల్ల పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనమవుతాయి.

ప్రసవ సమయంలో..

ప్రసవ సమయంలో..

ప్రసవ సమయంలో ఇది ఎక్కువగా ఉంటుంది. సాధారణ ప్రసవానికి పన్నెండు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమయంలో బిడ్డ బలవంతంగా బయటకు వస్తుంది. ఈ సమయంలో స్త్రీ తనకి ఉన్న శక్తినంతా ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో శరీరమంతటిపై ఎఫెక్ట్ పడుతుంది. చాలా ఇబ్బందిగా అనపిస్తుంది.

దీంతో కండరాలు దెబ్బతింటాయి. అయినప్పటికీ సీజేరియన్ చేయించుకుంటున్న రోగుల్లో కండరాల బలహీనత ఉండదు.

నార్మల్ డెలివరీ టైమ్‌లో..

నార్మల్ డెలివరీ టైమ్‌లో..

ప్రెగ్నెన్సీ టైమ్‌లో గర్భాశయ బరువు పెల్విస్ పై ఒత్తిడిని కలిగిస్తుంది.
సాధారణ ప్రసవంలో కండరాలు ఎక్కువగా సాగడం వల్ల ఈ సమస్య వస్తుంది.
అదే విధంగా మలబద్దకం, ప్రేగు కదలికల ఒత్తిడి, బరువు పెరగడం, ఒత్తిడి పెరుగుతుంది.
ఎండోమెట్రియోసిస్ మొదలైన వాటి వల్ల కండరాల సమస్యలు వస్తాయి.
Also Read : Pregnancy Diet : ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఇవి కచ్చితంగా తినాలి..

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్..

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్..

పెల్విక్ మజిల్స్ గర్భాశయం, మూత్రాశయాన్ని పొజిషన్‌లో ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి. ఇవి ఎక్కువగా విస్తరిస్తే మూత్రాశయం కిందికి దిగుతుంది. దీని వల్ల మూత్రాశయ సమస్యలు అంటూ మూత్రం ఉండిపోవడం, మూత్రాశయం ఖాళీ కాకపోవడం వంటివి ఎదురవుతాయి. దీని వల్ల బ్లాడర్ సమస్యలు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఎదురవుతాయి.

మూత్రం ఆగకపోవడం..

మూత్రం ఆగకపోవడం..

పెల్విక్ ఫ్లోర్ కండరాలు ఎక్కువగా సాగడం వల్ల మూత్రం ఆగదు. ఎమర్జెన్సీగా ఉంటుంది. నవ్వడం, దగ్గడం, శిశువుని ఎత్తడం, బరువైన వస్తువులు ఎత్తడం వల్ల శరీరంపై ఒత్తిడి పెరిగి మూత్రం లీక్ అవుతుంది.
Also Read : Uterine Prolapse : గర్భసంచి కిందికి ఎందుకు జారుతుంది

10, 15 ఏళ్ళ తర్వాత కూడా..

10-15-

ఈ సమస్య వెంటనే కనిపించకపోవచ్చు. సాధారణ పసవం తర్వాత 10 నుంచి 15 ఏళ్ళ తర్వాత కూడా ఈ సమస్య ఎదురవుతుంది. కండరాల బలహీనత పెరిగేకొద్దీ.. ఈ లీకేజీని కంట్రోల్ చేసుకోవడం ఆడవారికి మరింత కష్టమవుతుంది.

Dr. Mohan K
Consultant-Urology
Kidney Transplant and Laparoscopic Surgery
Manipal Hospital
Millers Road,
Bangalore

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Relationship News and Telugu News

Latest news
Related news