CS June 2023 session: లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు CS June 2023 session కు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అందుకు గానూ వారు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (Institute of Company Secretaries of India ICSI) అధికారిక వెబ్ సైట్ icsi.edu ని సందర్శించాల్సి ఉంటుంది. CS June 2023 session కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేట్ ఫీజు లేకుండా ఆఖరు తేదీ మార్చి 25. అలాగే, లేట్ ఫీజుతో ఏప్రిల్ 9 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్, ఎగ్జిక్యూటివ్ ప్రొగ్రామ్ లకు పరీక్ష ఫీజు రూ. 1200 లు గా నిర్ణయించారు.