Friday, March 24, 2023

Tirumala Laddu : తాటాకు బుట్టల్లో శ్రీవారి లడ్డూలు.. టీటీడీ మరో వినూత్న ఆలోచన

Tirumala Laddu : తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastanam) .. ప్రకృతి, పర్యావరణ హిత చర్యలపై దృష్టి సారించింది. సహజ పద్ధతులకు పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా… ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. లడ్డూ సహా ఇతర ప్రసాదాల తయారీలోనూ గణనీయ మార్పులు తీసుకొచ్చింది. ప్రకృతి వ్యవసాయ (Natural Farmers) రైతుల నుంచి శనగలు, బెల్లం, ధాన్యం తదితర ఆహార పదార్థాలను సేకరిస్తోంది. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రకృతి వ్యవసాయ రైతులతో ఒప్పందం చేసుకున్న టీటీడీ (TTD)… రైతులకి మద్దతు ధరలు ఇచ్చి.. పంటలు సేకరిస్తోంది. ఆ పదార్థాలనే .. ప్రసాదాల తయారీలో ఉపయోగిస్తోంది. ఈ విధానం ద్వారా అటు రైతులకి మంచి ఆదాయం సమకూరడంతో పాటు… భక్తులకి సహజ పంటలతో తయారు చేసిన ప్రసాదాలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే.. మరో వినూత్న ఆలోచనకు ఆచరణ రూపం ఇచ్చేందుకు సిద్ధమైంది టీటీడీ.

Source link

Latest news
Related news