Friday, March 24, 2023

Telugu News Updates 25 February: ఇవాళ శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు విడుదల

ఇవాళ తిరుమల శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల టికెట్లు విడుదల కానున్నాయి. రోజుకు 500 టికెట్ల చొప్పున శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ జారీ చేయనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల కానున్నాయి. టికెట్లను పొందాలనుకునే భక్తులు ఆన్‌లైన్‌లో 12 గంటలకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. టికెట్లు బుక్ చేసుకునేందుకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అధికారిక వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలి. సైట్లో సైన్ అప్ ఆప్షన్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.మరిన్ని తాజా వార్తల కోసం లైవ్ పేజీని రిఫ్రెష్ చేయండి…..

కుటుంబం పరువు తీసిందన్న కోపంతో కన్న తండ్రే కుమార్తెను దారుణంగా హతమార్చిన సంఘటన నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

భక్తులకు అలర్ట్… 

ఇవాళ తిరుమల శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల టికెట్లు విడుదల కానున్నాయి. రోజుకు 500 టికెట్ల చొప్పున శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ జారీ చేయనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల కానున్నాయి. టికెట్లను పొందాలనుకునే భక్తులు ఆన్‌లైన్‌లో 12 గంటలకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. టికెట్లు బుక్ చేసుకునేందుకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అధికారిక వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలి. సైట్లో సైన్ అప్ ఆప్షన్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.

బంగారం ధరలు 

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శనివారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 51,700కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 51,800గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1000 తగ్గి, రూ. 5,17,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,170గా ఉంది.

లోకేశ్ కామెంట్స్ 

జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలన్నారు. అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని చెప్పారు.

షెడ్యూల్ విడుదల 

Telangana State Post Graduate Engineering Common Entrance Test 2023: టీఎస్ పీజీఈసెట్ షెడ్యూల్‌ వచ్చేసింది. శుక్రవారం హైద‌రాబాద్‌ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ టెక్నాల‌జిక‌ల్ యూనివ‌ర్సిటీ(జెన్టీయూ) విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 2023-24 విద్యా సంవ‌త్స‌రానికి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ మేరకు పూర్తి వివరాలను పేర్కొన్నారు. టీఎస్ పీజీఈసెట్‌ నోటిఫికేష‌న్ ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌ల అవుతుంది.

cm jagan review on energy department: విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఇంధన శాఖ అధికారులతో సమీక్షించిన సీఎం… పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. వేసవిలో విద్యుత్‌ కొరత అనేది ఉండకూడదని స్పష్టం చేశారు. విద్యుత్‌ కొరత కారణంగా కరెంటు కోతలు అనే సమస్య ఉత్పన్నం కావొద్దని చెప్పారు. ఈ మేరకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.

కొత్త ప్యాకేజీ

దేశంలోని వివిధ ప్రాంతాలను చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ(IRCTC)టూరిజం అందుబాటు ధరలలో ప్యాకేజీలు ప్రకటిస్తోంది. ఇందులో టూరిజం ప్రాంతాలే కాకుండా… అధ్యాత్మిక ప్రాంతాలు కూడా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి గుజరాత్ కు కొత్త ప్యాకేజీని ప్రకటించింది. SUNDAR SAURASHTRA పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా అహ్మదాబాద్(AHMEDABAD ), ద్వారకా(Dwaraka), రాజ్‌కోట్, సోమనాథ్, వడోదరను సందర్శించొచ్చు. గుజరాత్ లోని పవిత్రమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకొవచ్చు.

హైదరాబాద్(Hyderabad నుంచి రైలు ద్వారా ఈ టూర్ ఉంది. ప్రస్తుతం ఈ టూర్ మార్చి 3, 2023న అందుబాటులో ఉంది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Source link

Latest news
Related news