Tuesday, March 21, 2023

pm kisan 13th installment, రైతులకు PM KISAN అప్‌డేట్.. రెండ్రోజుల్లో 13వ విడత డబ్బులు.. మీరు అర్హులేనా తెలుసుకోండిలా! – pm kisan samman nidhi 13th installment farmers to get rs 2000 on february 27th check name on beneficiary list


PM KISAN: కేంద్ర అందిస్తోన్న పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్తం. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 13 విడత నిధుల విడుదలకు ముహూర్త ఖరారైంది. హోలీకి ముందే రైతులకు మోదీ సర్కార్ ప్రత్యేక కానుక ఇవ్వనుంది. ఫిబ్రవరి 27న ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 13 విడత నిధులు జమ చేయనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 27 కర్ణాటకలోని బెలగావిలో జరిగే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం వేదికగానే 13 విడత కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేస్తారు ప్రధాని. అర్హులైన రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13 విడత ఈనెల 27న విడుదల చేయనున్నారు మోదీ. ఈ విడతలో మొత్తం 9 కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.18 వేల కోట్లు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, పీఎం కిసాన్ నిధి లబ్ధిదారుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇ-కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని కేంద్రం రైతులకు సూచించింది. ఇ-కేవైసీ పూర్తి చేసిన రైతులకే 13 విడత నిధులు వస్తాయని స్పష్టం చేసింది.

ఈ క్రమంలో కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీ ఈ 13 విడతకు అర్హులా కాదా అని తెలుసుకోవడం మంచిది. ఇప్పటికీ మీ ఇ-కేవైసీ పూర్తి చేయనట్లయితే.. ఈసారి మీకు నిధులు రానట్లే. వెంటనే పూర్తి చేసుకోవడం చాలా మంచిది.

స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

  • పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లోకి లాగిన్ కావాలి
  • ఆ తర్వాత ఫార్మర్స్ కార్నర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  • బెనిఫిసియరీ స్టేటస్ ట్యాబ్ ను ఎంచుకోవాలి.
  • ఆధార్ నంబర్, పీఎం కిసాన్ ఖాతా నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నమోదు చేయాలి
  • పూర్తి వివరాలు ఇచ్చాక గెట్ డేటా ఆప్షన్ ఎంచుకోవాలి
  • స్క్రీన్‌పై మీ వివరాలు కనిపిస్తాయి.

ఫిబ్రవరి 27న కర్ణాటక పర్యటనకు మోదీ..
ఈనెల 27న కర్ణాటకలోని శివమొగ్గ ఎయిర్ పోర్టులో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. ఈ క్రమంలోనే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, కొన్నింటిని ప్రారంభించడం చేస్తారు. బెలగావిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కర్ణాటకలో కొత్త ఎయిర్ పోర్ట్ అభివృద్ధి కోసం రూ.450 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. గంటకు 300 మంది ప్రయాణికులు వెళ్లేలా ప్యాసింజర్ టర్మినల్ నిర్మిస్తున్నారు. అలాగే శివమొగ్గలో రెండు రైల్వే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు.
రైతులకు అదిరే శుభవార్త.. ఈ వారమే PM Kisan డబ్బులు.. స్టేటస్ చెక్ చేసుకోండిలా..!ఏపీలో రైతులకు శుభవార్త.. ఈ నెల 27న అకౌంట్‌లలోకి డబ్బులు జమమీ PAN Card పోయిందా? ఇలా ఈజీగా మళ్లీ అప్లై చేసుకుని పొందండి..!



Source link

Latest news
Related news