Sunday, April 2, 2023

Nara Lokesh: నేను చిరంజీవిగారి అభిమానిని.. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాలి: నారా లోకేష్‌

Chiranjeevi – Yuva Galam: ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు నారా లోకేష్ ‘యువ గళం’ పేరుతో ఆంధ్ర ప్ర‌దేశ్‌లో పాదయాత్ర‌ను నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం తిరుప‌తిలో ఈ యాత్ర కొన‌సాగుతోంది. అందులో భాగంగా ఆయ‌న తిరుప‌తిలోని యువ‌త‌తో ముఖా ముఖి నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐఐఎం ప్రొఫెస‌ర్ రాజేష్ స‌హా ప‌లువురు విద్యార్థులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. ఈవెంట్‌లో ఓ యువ‌కుడు అడిగిన ప్ర‌శ్న‌కు నారా లోకేష్ మాట్లాడుతూ ..

‘‘నేను మెగాస్టార్ చిరంజీవికి అభిమానిని. ఆయ‌న హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చూశాను. ఇక బాల మామ గురించి చెప్పాలంటే ఎంతైనా నా మ‌ద్దుల మామ‌య్య‌. విడుద‌లైన మొద‌టి రోజు, మొద‌టి షోనే ఆయ‌న సినిమాలు చూస్తాను’ అన్నారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన్ని ఒకసారే కలిశానని, అలా కలిసిన సందర్భంలో ఆయ‌న మంచి మ‌నుసుని చూశాన‌ని అన్నారు లోకేష్‌. ఇక ఎన్టీఆర్ గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాలి అని లోకేష్‌ తెలిపారు.

‘ఎవ‌రైతే ఆంధ్ర ప్రదేశ్ నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉండాల‌ని కోరుకుంటారో వారంద‌రూ రాజకీయాల్లోకి రావాలి. పాలిటిక్స్‌లో ఉన్న‌వారికి మంచి మ‌న‌సు ఉండాలి. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌టానికి చేప‌ట్టిన యాత్రే యువ గ‌ళం’ అని ఈ సంద‌ర్భంగా లోకేష్ తెలిపారు. ఏపీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌పై లోకేష్ విమ‌ర్శ‌లు చేశారు.

ALSO READ: Naga Chaitanya: ‘కస్టడీ’ నుంచి బయటపడ్డ నాగ చైతన్య.. సమ్మర్ బ‌రిలో అక్కినేని హీరో
ALSO READ: HBD Nani: 15 ఏళ్లుగా మ‌ళ్లీ మ‌ళ్లీ పుడుతూనే ఉన్నాను: నాని

ALSO READ: Pooja Hegde: రూ.2 కోట్ల ఖరీదైన కారు కొన్న త్రివిక్ర‌మ్‌.. పూజా హెగ్డే కోస‌మేనంటూ ట్రోలింగ్‌!

ALSO READ: Simbu Marriage: బ‌డా బిబినెస్ మేన్ కూతురితో హీరో శింబు పెళ్లి..!

ALSO READ: పెళ్లితో ఒక్కటైన రాకింగ్ రాకేష్ – జోర్దార్ సుజాత

Latest news
Related news