Friday, March 24, 2023

Naga Chaitanya: ‘కస్టడీ’ నుంచి బయటపడ్డ నాగ చైతన్య.. సమ్మర్ బ‌రిలో అక్కినేని హీరో

Naga Chaitanya – Kriti Shetty: అక్కినేని హీరో నాగచైతన్య(Akkineni Naga Chaitanya) గత ఏడాది ‘బంగార్రాజు, థాంక్యూ’తో పాటు లాల్ సింగ్ చడ్డా’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ రెండు సినిమాలో బంగార్రాజు హిట్ అయ్యింది. కానీ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘థాంక్యూ’ మూవీ పెద్దగా ఆడలేదు. అలాగే నాగ చైతన్య బాలీవుడ్ డెబ్యూ ‘లాల్ సింగ్ చడ్డా’ సైతం డిసప్పాయింట్ చేసింది. ఈ నేపథ్యంలోనే చైతన్య. మొదటిసారి తమిళ్, తెలుగులో బైలింగువల్ మూవీగా ‘కస్టడీ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చైతు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ మూవీగా క‌స్ట‌డీ సినిమా రూపొందుతోంది. శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 24) రోజున ఎంటైర్ షూటింగ్‌ను పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఓ చిన్న వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో హీరో చైత‌న్య‌, హీరోయిన్ కృతి శెట్టితో పాటు ఇత‌ర స‌భ్యులు ఉన్నారు.

దర్శకుడు వెంకట్ ప్రభు కట్ చెప్పి ‘‘చైతు మా కస్టడీ నుంచి ఇక నీకు విడుదల’ అని చెప్పగా.. ‘మీ అందరినీ మే 12న కస్టడీలోకి తీసుకుంటాం. థియేటర్ లో కలుద్దాం’ అని నాగచైతన్య, కృతి శెట్టి చెప్పడం ఆకట్టుకుంది. ఈ ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కత్తిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో చైతన్య పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు.

ALSO READ: HBD Nani: 15 ఏళ్లుగా మ‌ళ్లీ మ‌ళ్లీ పుడుతూనే ఉన్నాను: నాని
ALSO READ: Pooja Hegde: రూ.2 కోట్ల ఖరీదైన కారు కొన్న త్రివిక్ర‌మ్‌.. పూజా హెగ్డే కోస‌మేనంటూ ట్రోలింగ్‌!

ALSO READ: Simbu Marriage: బ‌డా బిబినెస్ మేన్ కూతురితో హీరో శింబు పెళ్లి..!

ALSO READ: పెళ్లితో ఒక్కటైన రాకింగ్ రాకేష్ – జోర్దార్ సుజాత

Latest news
Related news