Friday, March 31, 2023

jobs in air india, Air India గుడ్‌న్యూస్.. 5 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు.. రూ.2 కోట్ల వరకు ప్యాకేజీ! – air india recruitment air india plans to hire over 4200 cabin crew 900 pilots this year


Air India: ప్రముఖ దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా ఏడాది క్రితమే ప్రభుత్వం నుంచి తన మాతృ సంస్థ టాటా గ్రూప్‌లో చేరింది. ఈ క్రమంలో తమ సేవలను భారీగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది టాటాల నేతృత్వంలోని ఎయిర్‌ ఇండియా. ఇందులో భాగంగానే ఇటీవలే 470 విమానాల కొనుగోలు కోసం ఎయిర్ బస్, బోయింగ్ సంస్థలతో చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో విమానాలు అందనున్న నేపథ్యంలో ఇప్పుడు నియామకాలపై దృష్టి సారించింది. అందుబాటులోకి విమానాలకు సరిపడా ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపారు. ఈ ఏడాదిలో సుమారు 5100 మందిని ఉద్యోగంలోకి తీసుకుంటామని పేర్కొంది.

ఈ ఏడాది క్యాబిన్ సిబ్బంది 4200, పైలట్లు 900 మందిని మొత్తంగా 5100 మందిని నియమించుకుంటామని తెలిపింది ఎయిర్ ఇండియా. భారీగా విమానాలకు ఆర్డర్ ఇచ్చిన కొద్ది రోజులకే ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయ సేవలతో పాటు అంతర్జాతీయంగానూ విమాన సేవలను విస్తరిస్తామని, అందులో భాగంగానే భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కొత్తగా ట్రైనీలుగా నియమించుకునే క్యాబిన్ సిబ్బందికి 15 వారాల శిక్షణ ఉంటుందని ఎయిర్ ఇండియా ఇన్‌ఫ్లైట్ సర్వీసెస్ హెడ్ సందీప్ వర్మ తెలిపారు. ట్రైనింగ్ సమయంలో భద్రత, సేవలు, దేశీయ ఆతిథ్యం, టాటా గ్రూప్ సంస్కృతి వంటి అంశాలపై శిక్షణ ఇస్తామని తెలిపారు.

గతేడాది 2022 మే నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 2023 వరకు మొత్తంగా 1900 మంది క్యాబిన్ సిబ్బందిని నియమించుకున్నట్లు తెలిపింది ఎయిర్ ఇండియా. జులై నుంచి జనవరి మధ్య 7 నెలల్లోనే కొత్తగా 1100 మందికి శిక్షణ ఇచ్చామని పేర్కొంది. అందులో 500 మందిని ఇప్పటికే వివిధ సేవల్లో నియమించుకున్నామని తెలిపింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 113 విమానాలు సేవలను కొనసాగిస్తున్నాయి. మొత్తం 1600 మంది పైలట్లు పని చేస్తున్నారు. మరోవైపు.. ఇటీవలే 36 విమానాలను లీజుకు తీసుకునేందుకు నిర్ణయించింది ఎయిర్ ఇండియా. అందులో రెండు విమానాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.

ఇటీవలే బోయింగ్, ఎయిర్ బస్ లతో 470 విమానాల కొనుగోలు చేసుకున్న ఎయిర్ ఇండియా కొన్ని ప్రత్యేక విమానాలను నడిపేందుకు నైపుణ్య వంతులైన పైలట్లకు భారీగా జీతం ఇచ్చేందుకు సిద్ధమైంది. సుదీర్ఘ సమయం పాటు విమానాలు నడిపే నైపుణ్య వంతులకు గరిష్టంగా ఏడాదికి రూ.2 కోట్లు వరకు జీతం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో కొత్తగా నియమించుకునే వారికి భారీగానే జీతాలు ఉండన్నాయి. అందుకు తగినట్లు నిరుద్యోగ యువత సిద్ధమై.. లక్షల్లో జీతం అందుకోండి మరి.
Air India బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ.2 కోట్లు జీతంతో జాబ్స్.. వారి పంట పండినట్లే!Go First బంపర్ ఆఫర్.. రూ.1,199 కే విమాన ప్రయాణం.. ఆఫర్ రెండు రోజులే!TCS అదిరే శుభవార్త.. ఎగిరి గంతేస్తున్న ఉద్యోగులు.. లేఆఫ్స్ ఉండవు, వారికి కొత్తగా అవకాశాలు



Source link

Latest news
Related news