టెస్టు మ్యాచ్‌లు జరిగిన తర్వాత మ్యాచ్ రిఫరీ అభిప్రాయం ఆధారంగా పిచ్‌లకి ఐసీసీ రేటింగ్ ఇస్తుంటుంది. ఇందులో వెరీ గుడ్, గుడ్, యావరేజ్, బిలోయావరేజ్, పూర్, అన్‌ఫిట్ అనే రేటింగ్స్ ఉంటాయి. ఒకవేళ పిచ్‌కి యావరేజ్ కంటే దిగువ రేటింగ్ వస్తే? అప్పుడు ఆ స్టేడియానికి డీమెరిట్ పాయింట్స్‌ని ఐసీసీ కేటాయిస్తుంది. ఈ డీమెరిట్ పాయింట్లు ఐదుకి చేరితే అప్పుడు ఆ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్పోతుంది.
గతంలో ఒకసారి నాగ్‌పూర్ స్టేడియం నిషేధాన్ని ఎదుర్కొంది. అప్పట్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు నుంచే బంతి విపరీతంగా తిరిగింది. దాంతో రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోయింది. దాంతో అప్పట్లో పూర్ రేటింగ్ దక్కించుకున్న నాగ్‌పూర్ పిచ్.. చాలా రోజులు ఇంటర్నేషనల్ మ్యాచ్‌కి ఆతిథ్యమిచ్చే ఛాన్స్ కోల్పోయింది.
ఇటీవల నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియా టీమ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 177, 91 పరుగులే చేయగా.. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది. అయితే.. ఆస్ట్రేలియా టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 52 పరుగుల వ్యవధిలోనే చివరి 9 వికెట్లు చేజార్చుకోవడంతో ఆస్ట్రేలియా మీడియా పిచ్‌పై పెద్ద రాద్దాంతం చేసింది. కానీ.. మ్యాచ్ రిఫరీ పిచ్‌కి యావరేజ్ రేటింగ్ ఇచ్చారు. అలానే ఢిల్లీ పిచ్ కూడా యావరేజ్ రేటింగ్‌తో బయటపడింది.
Read Latest Sports News, Cricket News, Telugu News