వాస్తవానికి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో కామెరూన్ గ్రీన్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ట్రోఫీ ఆరంభానికి ముందే చేతి వేలి గాయం కారణంగా అతను మొదట నాగ్‌పూర్ టెస్టుకి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత ఢిల్లీ టెస్టులో ఆడేలా కనిపించినా మ్యాచ్ టైమ్‌కి ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు. దాంతో పక్కన పెట్టారు. అయితే.. ఈరోజు ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఈ ఆల్‌రౌండర్ తాను పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నట్లు స్పష్టం చేశాడు.
‘‘ఢిల్లీ టెస్టుకి తుది జట్టులో నాకు అవకాశం దక్కేలా కనిపించింది. కానీ మిస్ అయ్యింది. దాంతో మరింత ఫిట్‌గా మారేందుకు అదనంగా మరో వారం దక్కింది. ఇప్పుడు నేను 100% మ్యాచ్ ఆడేందుకు రెడీ’’ అని కామెరూన్ గ్రీన్ వెల్లడించాడు. గత రెండేళ్ల నుంచి ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో ఆడుతున్న కామెరూన్ గ్రీన్.. ఇప్పటి వరకూ 18 టెస్టులాడి 806 పరుగులు చేశాడు. ఇందులో ఆరు అర్ధశతకాలు ఉన్నాయి. అలానే 23 వికెట్లు కూడా ఉన్నాయి. బౌలింగ్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 5/27.
Read Latest Sports News, Cricket News, Telugu News