భారత్ జట్టు విజయానికి 33 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన స్థితిలో హర్మన్ రనౌట్ కాగానే.. అక్కడి నుంచి టీమ్ ఒత్తిడికి గురైంది. ఒకవేళ తాను చివరి వరకూ క్రీజులో ఉండి ఉంటే? ఒక ఓవర్ మిగిలి ఉండగానే మ్యాచ్‌ని ముగించేదానిని అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది. హర్మన్ రనౌటైన తీరు కూడా ఆమె బ్యాడ్‌లక్ అని చెప్పాలేమో! క్రీజు వెలుపల ఆమె బ్యాట్ స్ట్రక్ అవడంతో రనౌట్‌గా వెనుదిరిగింది. ఇదే విషయాన్ని మ్యాచ్ తర్వాత కూడా చెప్పుకొచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్.. కన్నీళ్లు పెట్టుకుంది. అయితే.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజీర్ హుస్సేన్ మాత్రం హర్మన్ రనౌట్‌ని స్కూల్ పిల్లల తప్పిదంగా అభివర్ణించాడు. నిర్లక్ష్యంగా పరుగెత్తి.. బ్యాట్‌ని సరిగా క్రీజులో పెట్టలేకపోయిందని విమర్శించాడు.
నాజీర్ హుస్సేన్ వ్యాఖ్యలకి హర్మన్‌ప్రీత్ కౌర్ కౌంటరిచ్చింది. ‘‘క్రికెట్‌లో బ్యాటర్లు అలా రనౌటవడం నేను చాలా సార్లు చూశాను. కొన్ని సార్లు క్రీజు దగ్గర బ్యాట్ స్ట్రక్ అవుతుంటుంది. సెమీస్‌లో అలా నాకు స్ట్రక్ అవడం మా దురదృష్టం. ఇక నాజీర్ హుస్సేన్ స్కూల్ గర్ల్ రిమార్క్ కామెంట్స్.. అతని ఆలోచన ధోరణికి నిదర్శనం. నేను అది స్కూల్ గర్ల్ తప్పిదంగా భావించడం లేదు. మేము ఇంటర్నేషనల్ లెవల్‌లో మ్యాచ్‌లు ఆడుతున్నాం. ఓవరాల్‌గా ఆ రనౌట్ బ్యాడ్‌లక్ అంతే’’ అని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చింది.