ఎక్స్‌పర్ట్ సలహా..

మ్యారేజ్ రిలేషన్లో ఇద్దరికీ తమకంటూ ప్రైవసీ ఉండాలి. వారికంటూ కొంత టైమ్ ఉండాలి. అప్పుడే అది బోర్ కొట్టకుండా ఉంటుంది. ఏ రిలేషన్ అయినా మొదట్లో చాలా లవ్లీగా ఉంటుంది. ఒకరిపై ఒకరు అట్రాక్ట్ అవుతారు. అప్పుడు అంత బానే ఉంటుంది. కానీ, టైమ్ గడిచే కొద్దీ..ముందు ఉన్నంతగా ఉండదు. సాధారణంగా మనుషులు ఎవరైనా సరే వారికంటూ ప్రశాంతమైన టైమ్ కావాలనుకుంటారు. ఇది మీరు మీ వారికి అర్థమయ్యేలా చెప్పండి. వాష్ రూమ్ బదులు మిగతా సందర్భాల్లో టైమ్ స్పెండ్ చేద్దామని చెప్పండి.
Also Read : Weight loss Foods : ఈ 5 ఫుడ్స్‌తో కచ్చితంగా బరువు తగ్గుతారట..
టైమ్ స్పెండ్ చేసేందుకు..

నాకు తెలిసి మీరు, మీ వారు కలిసి గడిపేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. అవి మార్నింగ్, ఈవెనింగ్ వాక్, టీ టైమ్, ఏదైనా కలిసి మాట్లాడుకోవడం. ఇలాంటి సందర్భాల్లో టైమ్ ఎంతగానో స్పెండ్ చేయొచ్చు. మీ వారు మీతో టైమ్ గడపాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి తనతో పాటు మీరు కూడా డ్రైవింగ్‌కి వెళ్ళడం, యోగా, ఏరోబిక్స్ వంటి మంచి టైమ్‌ని కూడా గడపొచ్చు. దేనిలో మీరు ఎంజాయ్ చేయగలరో చేయండి. వీటితో పాటు ప్రతి పనిని కలిసి చేసేందుకు ప్రయత్నించండి.
Also Read : Winter Breakfast : ఉదయాన్నే ఈ బ్రేక్‌ఫాస్ట్ తింటే ఇన్ఫెక్షన్లు దూరమవుతాయట..
హార్ట్‌ఫుల్‌గా..

నిజానికీ, మీ ఆయన మీతో గడపాలని కోరుకోవడం ఆనందించదగ్గ విషయం. కాబట్టి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. వాష్‌రూమ్‌లో టైమ్ స్పెండ్ చేయడం కష్టంగా ఉంటే అది తనకు సున్నితంగా తెలియజేయండి. మీకు మీరుగా మిగతా సందర్భాలని క్రియేట్ చేసుకుని హ్యాపీగా ఉండండి. ఏదైనా సరే మనం ఎంజాయ్ చేసే విధానంలోనే ఉంటుందని అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని తనతో క్లియర్‌గా చెప్పండి. మీకు కూడా తనతో గడపడం ఇష్టమే కానీ, మీ ఇష్టాలను గుర్తించమని కోరండి. ఇలా వివరంగా, సున్నితంగా చెబితే సమస్య చాలా వరకూ సాల్వ్ అవుతుంది.
Also Read : Joint Pains : చలికాలంలో కీళ్ళనొప్పులు తగ్గేందుకు ఇలా చేయండి
తన గురించి కూడా ఆలోచించండి..

అదే విధంగా, తాను మీతో కలిసి స్నానం చేయాలని కోరుకుంటే అది కూడా వారం, పదిరోజులకి ఓ సారి కుదుర్చుకునేలా చేయండి. మీరిద్దరు కలిసి మంచి టైమ్‌ని ఎంజాయ్ చేయండి. మీకు ఈ విషయంలో ఏదైనా సలహా కావాలంటే ఎక్స్‌పర్ట్స్ సాయం తీసుకోండి. ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని మీ బంధాన్ని మరింత ఆనందంగా చేసుకోండి.
గమనిక : ఈ కథనాలు ఆ వ్యక్తులు పంచుకున్న అనుభవాలను మాత్రమే తెలియజేస్తుంది. ఇది ఎవరినీ ఉద్దేశించినది కాదు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.
- Read More : Relationship News and Telugu News