Avinash Reddy on CBI : సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ మరోసారి విచారించింది. ఈ కేసులో జనవరి 28న తొలిసారి అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ… ఇవాళ (ఫిబ్రవరి 24) రెండోసారి సుమారు 5 గంటల పాటు ప్రశ్నించింది. ఫోన్ కాల్స్, కాల్ డేటాపై ఆరా తీసినట్లు సమాచారం. వివేకాకు గుండెపోటు అని ఎందుకు చెప్పారని కూడా సీబీఐ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ విచారణ తర్వాత సీబీఐ ఆఫీసు నుంచి బయటికొచ్చిన అవినాశ్ రెడ్డి…. సీబీఐపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తి లక్ష్యంగా సీబీఐ విచారణ జరుగుతోందనే సందేహాం కలుగుతోందని అన్నారు.
BREAKING NEWS