Friday, March 24, 2023

Akshay Kumar: భారత్ నా సర్వస్వం.. కెనడా పాస్‌పోర్ట్ వద్దు.. ఎట్టకేలకు స్టార్ హీరోకు జ్ఞానోదయం!

Akshay Kumar Telugu News: బీటౌన్‌ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఏడాదికి నాలుగైదు చిత్రాలు చేస్తూ మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా కొనసాగుతున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పుట్టిన అక్షయ్.. సినిమాల్లోకి రాకముందు బ్యాంకాక్‌లో చెఫ్‌గా పనిచేశారు. అక్కడే మార్షల్ ఆర్ట్స్‌ నేర్చుకున్న అక్షయ్.. ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత కొన్నాళ్లు మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత ఓ ఫొటోగ్రాఫర్‌ సలహాతో మోడల్‌గా ప్రయత్నించి 1991లో హీరోగా మొదటి చాన్స్ అందుకున్నాడు. అయితే హిట్, ఫ్లాప్‌ సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో బిజీ కెరీర్ లీడ్ చేస్తున్న అక్షయ్‌కు కెనడా పౌరసత్వం కూడా ఉంది. ఇందుకు సంబంధించి ఈ మధ్య తనపై విమర్శలు వ్యక్తమవుతున్నందున షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు అక్షయ్.

భారతదేశమే తనకు సర్వస్వమని, అందుకే పాస్‌పోర్ట్ మార్పు కోసం ఇప్పటికే అప్లయ్ చేశానని లేటెస్ట్ ఇంటర్వ్యూలో అక్షయ్ తెలిపాడు. నిజానికి తాను కెనడియన్ పౌరసత్వం తీసుకునేందుకు గల కారణం గురించి తెలియకుండా జనాలు విమర్శిస్తుండటం పట్ల బాధపడినట్లుగా ‘సీధీ బాత్’ న్యూ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ఇంటర్వ్యూలో చెప్పారు.
‘భారతదేశం నాకు సర్వస్వం.. నేను ఇంత పేరు, డబ్బు సంపాదించింది ఇక్కడి నుంచే. అలాగే ఇప్పుడు తిరిగిచ్చే అవకాశం లభించడం నా అదృష్టం. కానీ జనాలు ఏమీ తెలియకుండా మాట్లాడినపుడు బాధనిపస్తుంది’ అని చెప్పుకొచ్చారు.

2017లో విడుదలైన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ మూవీ ప్రమోషన్స్‌లో తను కెనడా పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లు అక్షయ్ రివీల్ చేశారు. 1990లలో కెరీర్‌ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, తను నటించిన దాదాపు 15 సినిమాలు ఫ్లాప్ అవడంతోనే కెనడియన్ సిటిజన్‌షిప్(Canadian citizenship) కోసం అప్లయ్ చేసినట్లు వెల్లడించారు. అక్కడే ఉండే తన ఫ్రెండ్ రమ్మని పిలవడంతో సినిమాలు మానేసి ఏదైనా పని చేసుకుందామని వెళ్లినట్లు తెలిపారు. అందుకే కెనడా పౌరసత్వం తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

‘కెనడా వెళ్లే టైమ్‌కు రెండు సినిమాలు విడుదల కావాల్సి ఉంది. అదృష్టవశాత్తూ ఆ రెండూ సూపర్‌హిట్ కావడంతో స్నేహితుడి సలహాతో మళ్లీ తిరిగొచ్చాను. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అలాగే కెనడా పాస్‌పోర్ట్(Canadian Passport) ఉన్న విషయాన్ని మర్చిపోయాను. కానీ ఇప్పుడు మార్చుకునేందుకు అప్లయ్ చేశాను’ అని అక్షయ్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, 2019 లోక్‌సభ ఎలక్షన్స్‌కు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అక్షయ్ కుమార్ చేసిన ‘నాన్ పొలిటికల్’ ఇంటర్వ్యూ తర్వాత తన సిటిజెన్‌షిప్ అంశం తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఓటు వేసేందుకు అతని భార్య ట్వింకిల్ ఖన్నా మాత్రమే వెళ్లగా.. అక్షయ్ కుమార్ బయటకు రాకపోవడంతో చర్చనీయాంశంగా మారింది.

Latest news
Related news