Vande Bharat train: సీరియస్ యాక్షన్
వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat express) ట్రైన్సపై రాళ్ల దాడులు చేయడాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రాళ్ల దాడులు చేసిన వారికి నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేస్తామని హెచ్చరించింది. శనివారం మైసూరు – చెన్నై వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat express) ట్రైన్ పై గుర్తు తెలియని దుండగులు చేసిన రాళ్ల దాడి వలన రెండు కిటీకీల అద్దాలు ధ్వంసమయ్యాయని సౌత్ వెస్ట్ రైల్వేస్ (Southwest Railways) ప్రకటించింది. ప్రయాణీకులెవరూ గాయపడలేదని, ఈ దాడికి పాల్పడిన వారికి గుర్తించేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. జనవరి నెలలో సౌత్ వెస్ట్ రైల్వేస్ (Southwest Railways) పరిధిలో 21 రాళ్ల దాడుల ఘటనలు జరిగాయి. ఫిబ్రవరిలో బెంగళూరు డివిజన్లో 13 ఘటనలు చోటు చేసుకున్నాయి.