Friday, March 24, 2023

Veerasimhareddy OTT: ఓటీటీలో వీరసింహారెడ్డి సత్తా.. ఇక్కడా తగ్గని రికార్డ్‌ల వేట!

‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’ (Veerasimhareddy). గోపీచంద్ మలినేని (Gopichand Malinenei) దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. శ్రుతి హాసన్ (Shruthi Haasan) ఫిమేల్ లీడ్‌గా కనిపించగా.. థమన్ మ్యూజిక్ అందించారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌కు విడుదలైన ‘వీరసింహారెడ్డి’ టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మేరకు బాలయ్య కెరీర్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన రెండో సినిమాగా నిలిచింది. అంతకుముందు ‘అఖండ’ మూవీ ఈ ఫీట్ సాధించిన విషయం తెలిసిందే. ఇక యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టిన ‘వీరసింహా రెడ్డి’.. తాజాగా ఓటీటీ (OTT) స్ట్రీమింగ్‌ ప్రారంభం కాగా డిజిటల్‌ వేదికపైనా కొత్త రికార్డ్ సృష్టించింది.

‘వీరసింహా రెడ్డి’ సినిమా గురువారం సాయంత్రం నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే, విడుదలైన ఒక్క నిమిషంలోనే 150K పైగా యూనిక్ వ్యూయర్స్ ఈ చిత్రాన్ని చూసినట్లు సమాచారం. ఇది తెలుగు OTT చరిత్రలోనే సరికొత్త రికార్డ్. ఈ లెక్కన త్వరలోనే OTT వేదికగా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని బాలయ్య ఫ్రాన్స్‌తో పాటు ఎనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.
Shruthi Haasan: ‘సలార్’ నుంచి శ్రుతి హాసన్ అప్‌డేట్.. డైరెక్టర్‌పై చెయ్యేసిందంటే?
బాలయ్య డ్యూయల్ రోల్ పోషించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో శ్రుతి హాసన్‌తో పాటు హనీ రోజ్ హీరోయిన్‌గా నటించింది. అలాగే స్టార్ యాక్టర్ దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, లాల్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య గెటప్‌తో పాటు డైలాగ్స్‌, డాన్సులకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి.

ప్రస్తుతం బాలకృష్ణ.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో #NBK108 చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకోగా.. నెక్ట్స్ షెడ్యూల్ త్వరలోనే మొదలవనుంది. నిజానికి ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఆయన సోదరుడి కుమారుడు తారకరత్న మరణంతో నందమూరి ఫ్యామిలీ విషాదంలో ఉంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్ షెడ్యూల్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పైగా తారకరత్నతో బాలయ్యకు మంచి అనుబంధం ఉంది. ఆయన గుండె పోటుతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు.

మరోవైపు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ‘అన్‌స్టాపబుల్ టాక్ షో’ సీజన్2ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు బాలయ్య. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేసిన చివరి ఎపిసోడ్‌కు అభిమానుల నుంచి మంచి అప్లాజ్ లభించింది.

Latest news
Related news