భారీ లక్ష్య చేధనలో ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు డానియెల్లీ వ్యాట్ (30 బంతుల్లో 34), సోఫియా డంక్లీ (16 బంతుల్లో 28) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 5.1 ఓవర్లలోనే 53 పరుగులు జోడించారు. ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్న దశలో ఆరో ఓవర్ బౌలింగ్ చేసిన షబ్నిమ్ ఇస్మాయిల్ ఇంగ్లాండ్‌ను దెబ్బతీసింది. మూడు బంతుల వ్యవధిలో సోఫియా, అలీస్ క్యాప్సీ (0)ను పెవిలియన్‌కు చేర్చింది.
ఈ దశలో వ్యాట్, నాట్ సివెర్ బ్రంట్ (34 బంతుల్లో 40) దూకుడుగా ఆడారు. వ్యాట్ ఔటయ్యాక.. బ్రంట్ సఫారీ బౌలర్లపై ఎదురు దాడికి దిగింది. ఇంగ్లిష్ జట్టు 30 బంతుల్లో 48 పరుగులు అవసరమైన దశలో.. ఇస్మాయిల్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాదిన బ్రంట్.. 14 పరుగులు రాబట్టింది. దీంతో ఇంగ్లాండ్ గెలుపు సమీకరణం 24 బంతుల్లో 34 పరుగులుగా మారింది. కానీ 16.2వ ఓవర్లో బ్రంట్‌ను డి క్లెర్క్ ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. తర్వాతి ఓవర్లో అయబొంగా ఖాకా మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. చివరి ఓవర్లో హీథర్ నైట్ బౌల్డ్ కావడంతో ఇంగ్లాండ్ విజయానికి ఏడు పరుగుల దూరంలో నిలిచింది.
అంతకు ముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ సౌతాఫ్రికాకు ఓపెనర్లు వోల్వార్ట్ (44 బంతుల్లో 53), తజిమ్ బ్రిట్స్ (55 బంతుల్లో 68) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 13.4 ఓవర్లలో 96 పరుగులు చేశారు. నాలుగు పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ.. మరిజన్నే కప్ (13 బంతుల్లో 27 పరుగులు నాటౌట్) మెరుపులు మెరిపించడంతో సఫారీ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. సౌతాఫ్రికా జట్టు స్వదేశంలో.. అభిమానుల మధ్య ఆదివారం ఆస్ట్రేలియాతో ఫైనల్లో తలపడనుంది.