Thursday, March 30, 2023

Sonu Nigam: సింగర్ సోనూ నిగమ్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. వీడియో వైరల్

Sonu Nigam Hit case: బాలీవుడ్‌కి చెందిన స్టార్ సింగ‌ర్ సోనూ నిగ‌మ్‌పై సోమ‌వారం రాత్రి 11 గంట‌ల ప్రాంతంలో దాడి జ‌రిగింది. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో జ‌రిగిన ఓ మ్యూజిక‌ల్ ఈవెంట్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సోనూ నిగ‌మ్‌తో పాటు ఆత‌ని స్నేహితుడు ర‌బ్బానీ ఖాన్‌పై కూడా దాడి జ‌రిగింది. వెంట‌నే సోనూ నిగ‌మ్ బాడీ గార్డ్ వారిని దాడి నుంచి కాపాడాడు. వెంట‌నే వారిని చెంబూర్ ప్రాంతంలోని జైన్ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. సోను, అత‌ని స్నేహితుడితో కొంద‌రు గట్టిగా వాదించ‌టం కొట్టటంతో ఈవెంట్ ద‌గ్గ‌రున్న మెట్ల‌పై నుంచి వారు కింద ప‌డ్డారు, గాయ‌ల‌య్యాయి.

ఉద్ధ‌వ్ థాక్రేకి చెందిన ఎమ్మెల్యే ప్ర‌కాష్ ఫ‌ర్తేపేక‌ర్(Prakash Phaterpekar) అనుచ‌రులు సోనూ నిగ‌మ్‌పై దాడి చేసిన‌ట్లు స‌మాచారం. కానీ పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్నాయి. సోనూ నిగ‌మ్‌తో సెల్ఫీలు దిగ‌టానికి కొంద‌రు వ్య‌క్తులు ప్ర‌య‌త్నించారు. అప్పుడు సోనూ నిగ‌మ్ స్నేహితుడు ర‌బ్బానీ ఖాన్ అడ్డుప‌డ్డారు. దాంతో వారికి కోపం వ‌చ్చి దాడికి పాల్ప‌డ్డ‌ట్టు స‌మాచారం. దీనిపై సోనూ నిగ‌మ్ సైతం స్పందించారు. నన్ను తోసి వేశారు. నేను మెట్ల‌పై ప‌డిపోయాను. నన్ను కాపాడ‌టానికి వ‌చ్చిన నా స్నేహితుడిని వెనుక నుంచి తోసేశారు. అత‌ను చ‌చ్చిపోవాల్సింది. అదృష్టం కొద్ది బ‌తికిపోయాడు. ఈ ఘ‌ట‌న‌పై నేను పోలీసుల‌కు ఫిర్యాదు చేశాను అని అని తెలిపారు.

మ‌రి ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ ఎంత వ‌ర‌కు వ‌చ్చింది. నిజంగానే సెల్ఫీ కోస‌మే సోనూ నిగ‌మ్‌తో అక్క‌డి వ్య‌క్తులు గొడ‌వ ప‌డ్డారా? లేక మ‌రేదైనా ఉద్దేశం ఉందా? ఈ దాడిలో ఉద్ద‌వ్ థాక్రే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ ఫ‌ర్తేపేక‌ర్ కుమారుడు పాల్గొన్నారు. ఆయ‌న‌కు ఉన్న సంబంధం ఏంటి అనే విష‌యాలు తెలియాల్సి ఉన్నాయి. మ‌రి దీనిపై పోలీసులు ఏమంటారో చూడాలి మ‌రి.

ALSO READ: GG Krishna Rao: శంక‌రా భ‌ర‌ణం, సాగ‌ర సంగ‌మం చిత్రాల ఎడిట‌ర్ జి.జి.కృష్ణారావు క‌న్నుమూత‌
ALSO READ: Jr Ntr – Taraka Ratna: తారకరత్నకు జూనియర్ ఎన్టీఆర్ ఆర్థిక సాయం!

ALSO READ: Kantara 2: ‘కాంతార 2’లో సూపర్ స్టార్ రజినీకాంత్

ALSO READ: Chiranjeevi: ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్‌గా మెగాస్టార్.. పవన్ కళ్యాణ్ సాంగ్ రీమిక్స్‌లో చిరు స్టెప్పులు

Latest news
Related news