Monday, March 20, 2023

Pooja Hegde: రూ.2 కోట్ల ఖరీదైన కారు కొన్న త్రివిక్ర‌మ్‌.. పూజా హెగ్డే కోస‌మేనంటూ ట్రోలింగ్‌!

Trivikram – Pooja Hegde: టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఇప్పుడు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌తో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. SSMB 28గా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ శివారు ప్రాంతంలో వేసిన భారీ సెట్‌లో జ‌రుగుతుంది. కాగా.. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌. వీళ్లు కాకుండా బాలీవుడ్‌కి చెందిన భూమి పెడ్నేక‌ర్‌ని కూడా హీరోయిన్‌గా తీసుకున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే త్రివిక్ర‌మ్ త‌న సినిమాల్లో హీరోయిన్స్‌ను రిపీట్ చేస్తుంటారు. ఆ హీరోయిన్‌తో ఆయ‌కేదో ఉందంటూ వార్త‌లు కూడా వ‌స్తుంటాయి. ఆ మ‌ధ్య స‌మంత విష‌యంలో అలాగే ఇప్పుడు పూజా హెగ్డే విష‌యంలోనూ అలాగే జ‌రుగుతుంది.

స‌రే! ఈ విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే, తాజాగా త్రివిక్ర‌మ్, పూజా హెగ్డేల‌కు సంబంధించి మ‌రో వార్త ట్రోల్ అవుతుంది. అదేంటంటే..పూజా హెగ్డే కోసం త్రివిక్ర‌మ్ రెండు కోట్ల రూపాయ‌ల ఖ‌రీదైన కారుని కొన్నార‌ని. అస‌లు ఈ వార్త నెట్టింట వైర‌ల్ కావ‌టానికి కార‌ణం.. త్రివిక్ర‌మ్ షూటింగ్‌కి హీరోయిన్ కోసం ఓ కారుని ప్ర‌త్యేకంగా పెడుతుంటారు. ఆ కారుని కిరాయికి తీసుకున్న‌ప్పుడు ఎక్కువ ఖ‌ర్చు అవుతుంది. అలాంటి ఖ‌ర్చు ఎందుక‌ని రెండు కోట్ల రూపాయ‌ల‌తో కారుని త‌న ప్రొడ‌క్ష‌న్ త‌ర‌పు నుంచి కోనుగోలు చేయించారు. ఆ కారులో ఇప్పుడు లొకేష‌న్‌కి వ‌స్తున్న హీరోయిన్ పూజా హెగ్డే.

దీంతో పూజా హెగ్డే కోసం త్రివిక్ర‌మ్ ఓ స్పెష‌ల్ కారుని కొన్నారంటూ నెటిజ‌న్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక SSMB 28 సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమాను ఈ ఏడాది ఆగ‌స్ట్ 11న రిలీజ్ చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ కోసం మ‌హేష్ సిక్స్ ప్యాక్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ వంశీ (చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ALSO READ: Simbu Marriage: బ‌డా బిబినెస్ మేన్ కూతురితో హీరో శింబు పెళ్లి..!
ALSO READ: పెళ్లితో ఒక్కటైన రాకింగ్ రాకేష్ – జోర్దార్ సుజాత

Latest news
Related news