Friday, March 31, 2023

No Arms Kid Plays Cricket | చేతులు లేని బాలుడు క్రికెట్.. కుడి కాలినే బ్యాట్‌గా చేసుకుని బౌండరీలు!

అఫ్గానిస్థాన్‌ (Afghanistan )లో కొందరు బాలురు క్రికెట్ ఆడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుర్రాళ్లు క్రికెట్ ఆడటం కామనే కదా? ఇందులో విశేషం ఏముంది అంటారా?.. ఒక విశేషం ఉంది. ఆ కుర్రాళ్ల గుంపులో ఓ బాలుడికి రెండు చేతులు లేవు. కానీ స్నేహితులతో కలిసి పోటాపోటీగా క్రికెట్ ఆడుతున్నాడు. కాళ్లతో ఫీల్డింగ్ చేయడమే కాదు.. బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు. అంతేకాదండోయ్.. క్రీజు వెలుపలికి వెళ్లి మరీ బౌండరీలు కొడుతున్నాడు. ఇది ఎలా సాధ్యం అంటే? ఆ కుర్రాడు తన కుడికాలిని బ్యాట్‌గా చేసుకుని బంతిని కిక్ చేస్తున్నాడు.

పేరుకి అది గల్లీ క్రికెట్.. కానీ అన్ని రూల్స్ ఉన్నట్లు కనిపిస్తున్నాయి. వికెట్ల స్థానంలో రాళ్లని పేర్చారు.. అలానే వైడ్‌ నిర్ధారణ కోసం లైన్‌పై ఒక రాయిని ఉంచారు. మ్యాచ్‌కి అంపైర్ కూడా ఉన్నాడు. ఇక్కడ మరో ఆసక్తిరమైన విషయం ఏంటంటే.. ఆ చేతులు లేని బాలుడు బౌండరీ కొట్టిన తర్వాత నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని కుర్రాడు (బ్యాటర్) వచ్చి ఆనందంతో అతనికి హైఫై ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అతని చర్యకి ఆ చేతులు లేని బాలుడు ఏమీ హర్ట్ అవలేదు. తన భుజాన్ని అతనికి చూపించాడు. దాంతో అతను భుజంపై తట్టి అభినందించాడు. మ్యాచ్‌లో అందరికీ వర్తించే రూల్స్ ఆ చేతులు లేని బాలుడికి కూడా వర్తిస్తున్నాయి.

ఈ ఫ్రెండ్స్ మధ్య ఎంత బాండేజ్ ఉందంటే? భుజంపై తట్టి అభినందించిన నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని కుర్రాడు.. ఆ తర్వాత కాలితో ఓ కిక్ కూడా ఇచ్చాడు. ఇక్కడ అతడ్ని అవమానించాలి లేదా గాయపర్చాలి అని తన్నినట్లు కాదు. ఆ కుర్రాడి దృష్టిలో కాలు ఓ బ్యాట్! అలా అతని ఫ్రెండ్స్ ఫిక్స్ అయిపోయారు. ఫ్రెండ్‌షిప్ గొప్పతనానికి ఈ వీడియో నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news