పేరెంట్స్ శ్రీదేవి, బోనీ కపూర్ ఇద్దరు కూడా తన రిలేషన్‌షిప్స్ విషయంలో జాగ్రత్తలు చెప్పేవారని జాన్వి పేర్కొంది. ఈ విషయంలో వాళ్లిద్దరూ డ్రమాటిక్‌గా ఉండేవారని.. ఎవరైనా అబ్బాయి నచ్చినపుడు తమకు చెప్తే పెళ్లి చేస్తామనేవారని తెలిపింది. కానీ ‘నచ్చిన ప్రతి అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటాం? కొందరితో జస్ట్ చిల్ అవుతాం కదా!’ అనేది తన సిద్ధాంతమని వెల్లడించింది. అయితే ‘చిల్ అంటే ఏంటి? అని శ్రీదేవి అడిగేదని జాన్వి తల్లి గురించి గుర్తు చేసుకుంది.
ఇక అతిలోక సుందరి శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న కన్నుమూశారు. ఆమె ఐదో వర్ధంతి సందర్భంగా జాన్వి తల్లితో కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్‌ను పంచుకుంది.‘నేను ఇప్పటికీ నీ కోసం ప్రతిచోటా వెతుకుతున్నాను అమ్మా, నేను చేసే ప్రతి పనితో నిన్ను గర్వపడేలా చేస్తున్నాను. ఎక్కడికి వెళ్లినా చేసే ప్రతి పని నీతోనే మొదలై, నీతోనే ముగుస్తుంది’ అని పేర్కొంది.
ఇదే క్రమంలో తాజాగా శ్రీదేవి భర్త బోనీ కపూర్ సైతం ఆమెతో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ త్రో బ్యాక్ పిక్చర్స్ షేర్ చేశాడు. శ్రీదేవితో దిగిన ఫస్ట్ ఫొటో, రొమాంటిక్ పిక్‌తో పాటు చివరి ఫొటోను కూడా ఐదో వర్థంతి సందర్భంగా పంచుకున్నారు.
- Read Latest Tollywood Updates and Telugu News