Thursday, March 30, 2023

charges levied by banks, Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలా? బ్యాంకులు విధించే ఈ ఛార్జీలు తెలుసుకోండి.. – home loan charges 2023 know the total cost of your home loan before you apply


Home Loan: కలల ఇంటిని నిర్మించుకోవడమో లేదా అపార్ట్‌మెంట్, విల్లాలను కొనుగోలు చేసేందుకు ప్రస్తుత రోజుల్లో బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. మనకు నచ్చినట్లు ఇంటిని నిర్మించుకోవడానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అంత మొత్తంలో డబ్బులు ఉండవు కాబట్టి బ్యాంకులపై ఆధారపడక తప్పదు. ఇప్పుడు చాలా బ్యాంకులు పెద్ద మొత్తంలో లోన్లు ఇస్తున్నాయి. అయితే, రుణాలు ముంజూరు చేసేందుకు బ్యాంకులు అనేక రకాల ఫీజులు వసూలు (Home Loan Charges) చేస్తుంటాయి. ఈ ఫీజులు వివిధ బ్యాంకుల్లో వేరు వేరుగా ఉంటాయి. లోన్ దరఖాస్తు చేసుకునే ముందే హిడెన్ ఛార్జీలు ఏమైనా ఉన్నాయా? ఇంకా ఎలాంటి ఛార్జీలు వసూలు చేస్తున్నారు? అనే విషయాలను తెలుసుకోవడం మంచిది. ఈ క్రమంలో గృహ రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తున్న వివిధ రకాల ఫీజుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రాసెసింగ్ రుసుములు..
బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్న క్రమంలో ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తుంటాయి. ప్రతి బ్యాంకు వీటిని విధిస్తుంది. ఈ రుణాలపై బ్యాంకులు 0.20 శాతం నుంచి 2 శాతం వరకు ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేస్తాయి. ఈ ఫీజులకు అదనంగా 0.35 శాతం జీఎస్‌టీ సైతం ఉంటుంది.

అడ్మినిస్ట్రేషన్ రుసుములు..
లీగస్ ఒపీనియన్స్, ఆస్తి విలువను బట్టి వేరు వేరు రుసుములు వసూలు చేస్తాయి బ్యాంకులు. ఈ ఛార్జీలు లోన్ మొత్తంపై 0.20 శాతం నుంచి 0.50 శాతం వరకు ఉంటాయి. బ్యాంకులను బట్టి మారుతుంటుంది.

డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్..
గృహం టైటిల్ డీడ్‌పై తనఖాని సృష్టించడానికి ఈ ఛార్జీని బ్యాంకు విధిస్తుంది. ఈ రుసుములు లోన్ మొత్తంలో 0.10 శాతం నుంచి 0.50 శాతం వరకు ఉంటాయి.

డాక్యుమెంటేషన్ ఫీజులు..
లోన్ తీసుకుంటున్న వారి డాక్యుమెంట్లను భద్ర పరచడానికి, రికార్డు చేయడానికి డాక్యుమెంటేషన్ రుసుములను బ్యాంకులు విధిస్తాయి.

రుణ ఛార్జీలపై జీఎస్టీ..
లోన్ తీసుకున్న సమయంలో విధించే వివిధ ఛార్జీలపై జీఎస్టీ సైతం చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజులపై 0.35 శాతం, ఇతర రుసుములపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఈఎంఐ ఆలస్యంగా చెల్లిస్తే జరిమానాపై కూడా 18 శాతం జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుంది.

మినహాయింపులు..
డెవలపర్, బ్యాంకులతో ఒప్పందాలు పెట్టుకుంటే.. లీగల్, వాల్యుయేషన్, ప్రాసెసింగ్ ఛార్జీల్లో మినహాయింపులు పొందొచ్చు. ఇలా బ్యాంకులతో ఒప్పందం పెట్టున్న పెద్ద పెద్ద రియాల్టీ సంస్థల వద్ద కొనుగోలు చేయడం ద్వారా మన్ని ప్రయోజనాలు పొందే వీలుంటుంది. అన్ని చూసుకున్న తర్వాతే ఇంటిని కొనుగోలు చేయడం, హోమ్ లోన్ తీసుకోవడం చేయాలి.

MCLR: వడ్డీ రేట్లు పెంచిన ప్రముఖ బ్యాంక్.. ఇక EMIలు ఎక్కువ కట్టాల్సిందే!Home Loan కావాలా? అత్యంత తక్కువ వడ్డీ ఈ బ్యాంకుల్లోనే.. ఎక్కడెక్కడ ఎంత EMI కట్టాలంటే?



Source link

Latest news
Related news