(5 / 5)
ఏపీకి మూడో గవర్నర్ గా రానున్న ఎస్ అబ్దుల్ నజీర్.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించి.. ఈ ఏడాది జనవరి 4న పదవీ విరమణ పొందారు. 1958 జనవరి 5న అప్పటి మైసూర్ రాష్ట్రం ( ప్రస్తుతం కర్ణాటక) బెలువాయిలో జన్మించిన ఆయన… ముడిబిద్రిలోని మహావీర్ కళాశాలలో బీకాం గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మంగళూరులోని కొడియాల్ బైల్ లోని ఎస్డీఎమ్ కళాశాల నుంచి ఎల్ఎల్బీ పట్టా అందుకున్నారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించి… కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నారు. కర్ణాటక హైకోర్టులో సేవలు అందిస్తుండగానే … పదోన్నతి పొంది, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ గా చేయకుండానే.. దేశ సరోన్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఎంపికైన మూడో జడ్జగా గుర్తింపు పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా… 2017, ఫిబ్రవరి 17 నుంచి 2023 జనవరి 4 వరకు సేవలు అందించారు. పలు కీలక కేసుల్లో తీర్పునిచ్చారు.